భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే....

By Sandra Ashok Kumar  |  First Published Dec 7, 2019, 4:46 PM IST

రెనాల్ట్ ఇండియా నవంబర్‌లో దేశీయంగా మొత్తం అమ్మకాలు 10,882 యూనిట్లు ఉండగా, గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే  6134 వాహనాల అమ్మకాలు జరిగాయి. దీంతో కంపెనీ 77 శాతం వృద్ధిని సాధించింది. 


రెనాల్ట్ ఇండియా 2019 నవంబర్ నెలలో దేశీయంగా అమ్మకాల సంఖ్యను భారీగా పెంచుకుంది. దీంతో కంపెనీ 77 శాతం వృద్ధిని సాధించింది. గత నెలలో రెనాల్ట్ ఇండియా కంపెనీ  దేశీయంగా మొత్తం అమ్మకాలు 10,882 యూనిట్లు ఉండగా, 2018 నవంబర్‌లో నెలతో పోలిస్తే  6134 వాహనాలు అమ్మకాలు జరిగాయి.

also read విపణిలోకి మహీంద్రా తొలి బీఎస్-6 ‘ఎక్స్‌యూవీ 300’

Latest Videos

అక్టోబర్ 2019 కూడా కంపనీకి మంచి నెల, దీపావళి నెలలో రెనాల్ట్ 11, 516 కార్లను విక్రయించి దీంతో 63 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే  7,066 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. రెనాల్ట్ ఇండియా ఇయర్-టు-డేట్ (వైటిడి) ఏప్రిల్ 2019 నుండి నవంబర్ 2019 వరకు 76,905 యూనిట్ల అమ్మకాలు చేసింది.

2019లో రెనాల్ట్ ఇండియా మూడు ముఖ్యమైన లాంచ్‌లు చేసింది.అందులో ఒకటి డస్టర్ ఫేస్‌లిఫ్ట్ జూలైలో, సరికొత్త రెనాల్ట్ ట్రైబర్ ఆగస్టులో, రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ అక్టోబర్ 2019 లో ప్రారంభించారు. డస్టర్, క్విడ్ అమ్మకాలు సంఖ్యలు చాలా వరకు ఒకే విధంగా ఉన్నాయి కానీ ట్రైబర్ కార్ నెలవారీ అమ్మకాలు మాత్రం భారీగా ​​జరిగాయి.

ఆగస్టు, నవంబర్ మధ్య కంపెనీ రెనాల్ట్ ట్రైబర్ 18,511 యూనిట్లను అంటే నెలకు సగటున 4600 యూనిట్లను విక్రయించింది. నవంబరులో ట్రిబెర్ కారు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన రెనాల్ట్ కారుగా నిలిచి 6,071 యూనిట్ల అమ్మకాలను అధిగమించింది.

also read  8 సెకన్లలో 100 కి.మీ వేగం...ఎంజీ మోటార్స్‌ ‘జెడ్‌ఎస్‌’ స్పెషాలిటీ


ఇతర మోడళ్ల విషయానికొస్తే రెనాల్ట్ క్విడ్ నవంబర్‌లో 4,182 యూనిట్లతో అత్యధికంగా అమ్ముడైన రెండవ కారుగా నిలిచింది. రెనాల్ట్ డస్టర్ 505 యూనిట్లు, క్యాప్చర్ 118 యూనిట్లను విక్రయించారు. ఏదేమైనా రెనాల్ట్ లాడ్జీ గత నెలలో 6 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

గత నెలలో కంపెనీ అమ్మకాలను పెంచడానికి కొన్ని భారీ డిస్కౌంట్లను ప్రకటించింది, ఇందులో క్యాప్చర్ పై  3 లక్షల తగ్గింపు, డస్టర్‌ పై 1.55 లక్షల వరకు ప్రయోజనాలను ఇంకా క్విడ్‌ పై 50వేల వరకు లాయల్టీ ప్రయోజనాలు ప్రకటించింది.

click me!