నిస్సాన్ కార్లపై అధ్బుతమైన అఫర్లు

Published : Dec 07, 2019, 11:28 AM ISTUpdated : Dec 07, 2019, 02:42 PM IST
నిస్సాన్ కార్లపై అధ్బుతమైన అఫర్లు

సారాంశం

నిస్సాన్ ఇండియా కిక్స్ ఎస్‌యూవీ, డాట్సన్ రెడి-గో, డాట్సన్ జిఒ మరియు జిఒ + లపై  ఆఫర్లను ప్రకటించింది. కంపెనీ ప్రకటించిన ఈ ఆఫర్లను 'రెడ్ వీకెండ్స్' అని పిలుస్తుంది. ఈ అఫర్లపై ఏదైనా నిస్సాన్ డీలర్‌షిప్‌ను సందర్శించి మరింత సమాచారం పొందవచ్చు

నిస్సాన్  కిక్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కారు తక్కువ కాలంలోనే  కంపెనీకి మంచి అమ్మకాలను తెచ్చిపెట్టింది అదే విధంగా ఇప్పుడు నిస్సాన్ తమ బ్రాండ్ కార్లపై అఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా కొన్ని మోడళ్లపై రూ .40 వేల వరకు డిస్కౌంట్ తగ్గింపు, 40వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 10వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఇవ్వనుంది.

also read 63వేల కార్లను రీకాల్ చేసిన మారుతి సుజుకి...కారణం ?

నిస్సాన్ ఇండియా కిక్స్ ఎస్‌యూవీ, డాట్సన్ రెడి-గో, డాట్సన్ జిఒ మరియు జిఒ + లపై  ఆఫర్లను ప్రకటించింది. కంపెనీ ప్రకటించిన ఈ ఆఫర్లను 'రెడ్ వీకెండ్స్' అని పిలుస్తుంది. ఈ అఫర్లపై ఏదైనా నిస్సాన్ డీలర్‌షిప్‌ను సందర్శించి మరింత సమాచారం పొందవచ్చు అలాగే ఒక కోటి వరకు గిఫ్ట్ వోచర్లను కూడా గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. 

ప్రస్తుతం నిసాన్ కిక్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కారు సంస్థకు మంచి అమ్మకాలను తెచ్చిపెడుతుంది. 1500పైగా నగరాల్లో 24X7 రోడ్‌సైడ్ అస్సిస్టెన్స్ తో కిక్స్‌పై ₹ 25,000 వరకు వారంటీని కంపెనీ అందిస్తోంది.

also read కొత్త వసంతంలో కొత్త కార్లు...నాలుగు నెలల్లో 40వేల అమ్మకాలు

ఈ ఆఫర్లతో సంస్థ మొదటిసారి కారు కొనే కస్టమర్లను ప్రోత్సహించాలనుకుంటుంది, డాట్సన్ GO మరియు GO + లలో ఆఫర్‌లు మరియు ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా ఉన్నాయి.
 

PREV
click me!

Recommended Stories

Swivel Seat: ఇక వృద్ధులకు కారెక్క‌డం ఇబ్బంది కాదు.. అద్భుత ఆలోచ‌న చేసిన మారుతి
TATA Sierra : వింటేజ్ లుక్ లో ఏముంది గురూ..! కేవలం 24 గంటల్లో 70000 కార్లు బుక్కయ్యాయా..!!