63వేల కార్లను రీకాల్ చేసిన మారుతి సుజుకి...కారణం ?

By Sandra Ashok Kumar  |  First Published Dec 6, 2019, 4:56 PM IST

మారుతి సుజుకి ఇండియా జనవరి 1, 2019 నుండి నవంబర్ 21, 2019 మధ్య తయారు చేసిన సియాజ్, ఎర్టిగా మరియు ఎక్స్‌ఎల్ 6 వాహనాలలో పెట్రోల్ స్మార్ట్ హైబ్రిడ్ (ఎస్‌హెచ్‌విఎస్) వేరియంట్ కార్లకు రీకాల్ జారీ చేసింది. 


మారుతి సుజుకి జనవరి 1, 2019 నుండి నవంబర్ 21, 2019 మధ్య తయారు చేసిన కార్లను రీకాల్ చేసింది. ఈ కారణంగా సియాజ్, ఎర్టిగా, ఎక్స్ఎల్ 6  పెట్రోల్ ఎస్‌హెచ్‌విఎస్ వేరియంట్లపై ప్రభావం చూపనుంది. మారుతి సుజుకి ఇండియా జనవరి 1, 2019 నుండి నవంబర్ 21, 2019 మధ్య తయారు చేసిన సియాజ్, ఎర్టిగా మరియు ఎక్స్‌ఎల్ 6 వాహనాలలో పెట్రోల్ స్మార్ట్ హైబ్రిడ్ (ఎస్‌హెచ్‌విఎస్) వేరియంట్ కార్లకు రీకాల్ జారీ చేసింది.

also read కొత్త వసంతంలో కొత్త కార్లు...నాలుగు నెలల్లో 40వేల అమ్మకాలు

Latest Videos

సియాజ్, ఎర్టిగా, ఎక్స్‌ఎల్ 6 పెట్రోల్ ఎస్‌హెచ్‌విఎస్ వేరిఎంట్ మొత్తం వాహనాలు 63,493. ఈ కార్లలో మోటారు జనరేటర్ యూనిట్ (ఎంజియు) సమస్య కారణంగా సంస్థ వాటిని చెక్ చేయడానికి రికాల్ చేస్తుంది. ఓవర్ సీస్ గ్లోబల్ పార్ట్ సప్లయెర్స్ కార్ల తయారీ సమయంలో MGUలో చిన్న లోపం జరిగి ఉండవచ్చు అని తెలిపింది.


మారుతి సుజుకి ఈ రీకాల్ ద్వారా వచ్చే అన్ని వాహనాలను తనిఖీ చేసి లోపం ఉన్న పార్ట్లను వాహనాలకు  రీప్లేస్‌మెంట్  ఉచితంగా చేసిస్తారు. ఈ రోజు నుంచి వాహనాల యజమానులకి మారుతి సుజుకి డీలర్లు సంప్రదించి ఈ విషయాన్ని తెలియజేస్తారు.

also read 8 సెకన్లలో 100 కి.మీ వేగం...ఎంజీ మోటార్స్‌ ‘జెడ్‌ఎస్‌’ స్పెషాలిటీ

 వాహనాల వినియోగదారులు కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించి వారి వాహనానికి ఈ రీకాల్ సమస్య ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. కార్ ఇంజన్ చాసిస్ నంబర్ ద్వారా  కారు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.  
 

click me!