ఐదేళ్లలో టాప్-10లోకి భారత్: మార్కెట్‌లోకి లంబోర్ఘినీ ‘యూరుస్’!

By Arun Kumar PFirst Published Sep 28, 2018, 11:30 AM IST
Highlights

 ఐదేళ్లలో టాప్-10లోకి భారత్: మార్కెట్‌లోకి లంబోర్ఘినీ ‘యూరుస్’!

పుణె: ఇటలీకి చెందిన సూపర్ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘినీ..దేశీయ మార్కెట్‌లోకి మరో అత్యంత విలువైన కారును అందుబాటులోకి తెచ్చింది. యూరుస్ పేరుతో విడుదల చేసిన ఈ కారు ప్రారంభ ధర రూ.3.1 కోట్లుగా నిర్ణయించింది. వచ్చే రెండేళ్లలో రెండింతలు పెరిగే అవకాశం ఉన్నదని ఆటోమొబిలి లంబోర్ఘినీ ఆసియా పసిఫిక్ సీఈవో మ్యాట్టియో ఓర్టెంజ్ తెలిపారు. 

వచ్చే ఐదేళ్లలో టాప్-10 అంతర్జాతీయ మార్కెట్లో భారత్ కూడా చేరనున్నదని ఆశాభావం వ్యక్తంచేశారు. హ్యురాకెన్, అవెంటడోర్ మోడళ్లను ఇప్పటికే దేశీయంగా విక్రయిస్తున్న సంస్థకు ఈ నూతన మోడల్‌లో అమ్మకాలు రెండింతలు పెరిగే అవకాశం ఉన్నదని కంపెనీ వర్గాలు తెలిపాయి. గతేడాది దేశీయంగా 26 కార్లు విక్రయించింది. గతేడాది అమెరికాలో వెయ్యికిపైగా కార్లను విక్రయించిన సంస్థ ఇటలీలో 119 యూనిట్లతో పదో స్థానంలో నిలిచింది. 

భారతదేశంలో కార్ల తయారీ మార్కెట్లలో లంబోర్ఘినీని టాప్-10 చేరిపోతుందని సంస్థ ఆసియా పసిఫిక్ సీఈఓ మాట్టెయో ఒర్టెంజీ తెలిపారు. భారతదేశంలో కార్ల విక్రయానికి మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 2017లో అమెరికా, జపాన్, బ్రిటన్, గ్రేటర్ చైనా, జర్మనీ, కెనడా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, మొనాకో, ఇటలీ దేశాల్లో లంబోర్ఘినీ కార్లు అత్యధికంగా అమ్ముడుపోయాయి.  

భారతదేశంలో ఆర్థిక ప్రగతి, శరవేగంగా మెరుగవుతున్న మౌలిక వసతులతో పరిస్థితులు సానుకూలంగా మారతాయి. వచ్చే మూడు, నాలుగేళ్లలో భారతదేశం విభిన్న స్థాయికి చేరుకుంటుందని లంబోర్ఘినీ ఆసియా పసిఫిక్ సీఈవో మ్యాట్టియో ఓర్టెంజ్ చెప్పారు. అంతర్జాతీయంగా ఇప్పటివరకు 70 శాతం కస్టమర్లు ఉంటే భారతదేశంలోనే 68 శాతమని తెలిపారు. 

లంబోర్ఘినీ ఇండియా అధిపతి శరద్ అగర్వాల్ మాట్లాడుతూ ‘మా సంస్థ యురుస్ మోడల్ పేరుతో నూతన సెగ్మెంట్ తయారు చేసింది. సూపర్ లగ్జరీ, లగ్జరీ, ప్రీమియం సెగ్మెంట్ల వినియోగదారులను ఆకర్షించింది. ఇప్పటివరకు 500 మంది వరకు ‘లంబోర్ఘినీ యురుస్’ మోడల్ కార్లు బుకింగ్ అయ్యాయి. బుకింగ్ చేసుకున్న ఆరు, తొమ్మిది నెలల్లో కారు డెలివరీ అందజేస్తామన్నారు. లంబోర్ఘినీతోపాటు ఫెర్రారీ, ఆస్టోన్ మార్టిన్, ఆడి ఆర్8, మెర్సిడెస్ ఏఎంజీ జీటీ-ఆర్ మోడల్ కార్లు అత్యధికంగా అమ్ముడుపోయిన మోడల్స్‌లో ఉన్నాయి. 

click me!