అతిపెద్ద ఆటోమొబైల్ సంస్థ హీరో మోటోకార్ప్ కొత్త హీరో గ్లామర్ 100 మిలియన్ ఎడిషన్ మోడల్‌ను సోమవారం విడుదల చేసింది. అంతేకాదు ఈ నెల మొదట్లో ఇలాంటి అనేక స్పెషల్ ఎడిషన్ ద్విచక్ర వాహనాలను కూడా కంపెనీ మార్కెట్లో విడుదల చేసింది.
ప్రపంచవ్యాప్తంగా బైకులు, స్కూటర్లను తయారుచేసే అతిపెద్ద ఆటోమొబైల్ సంస్థ హీరో మోటోకార్ప్ కొత్త హీరో గ్లామర్ 100 మిలియన్ ఎడిషన్ మోడల్‌ను సోమవారం విడుదల చేసింది. అంతేకాదు ఈ నెల మొదట్లో ఇలాంటి అనేక స్పెషల్ ఎడిషన్ ద్విచక్ర వాహనాలను కూడా కంపెనీ మార్కెట్లో విడుదల చేసింది. హీరో గ్లామర్ 100 మిలియన్ ఎడిషన్‌లో ప్రత్యేకత ఏమిటో తెలుసుకొండి..
కలర్ స్కీమ్
హీరో కొత్త '100 మిలియన్ ఎడిషన్' బ్రాండ్ యొక్క మొత్తం 100 మిలియన్ల ద్విచక్ర వాహనాల అమ్మకాల సందర్భంగా జరుపుకుంటుంది.
undefined
100 మిలియన్ ఎడిషన్ లో ఇతర స్పెషల్ ఎడిషన్ మోడళ్లలో చూసినట్లుగా కొత్త గ్లామర్ డ్యూయల్-టోన్ వైట్ అండ్ రెడ్ కలర్ ఫినిషింగ్‌ను పొందుతుంది. బైక్ హెడ్‌లైట్ కౌల్, ఫ్యూయల్ ట్యాంక్, బ్యాక్ ప్యానెల్‌లో చెకర్డ్ ఫ్లాగ్ డిజైన్ లభిస్తుంది.
ఫీచర్స్
హీరో గ్లామర్‌లో కొత్త పెయింట్ స్కీమ్ కాకుండా ఇతర బైక్ అప్ డేట్స్ ఉండవు. ఇంతకు ముందు మోడల్ ఫీచర్స్ లభిస్తాయి. హాలోజన్ హెడ్‌లైట్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో-సెల్ ఫంక్షన్, ఇంధన ట్యాంక్, స్ప్లిట్-స్టయిల్ అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది.
బైక్ మెకానికల్స్ గురించి మాట్లాడితే 124.7 సిసి, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను పొందుతుంది. ఈ ఇంజిన్ 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.7 బిహెచ్‌పి శక్తిని, 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 10.6 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ కి 5-స్పీడ్ గేర్‌బాక్స్ అందించారు.
ధర
కొత్త హీరో గ్లామర్ 100 మిలియన్ ఎడిషన్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధర 73,700, డిస్క్ బ్రేక్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర 77,200.
హీరో మోటోకార్ప్ జనవరి నెలలో 100 మిలియన్ యూనిట్ల అమ్మకాలతో ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని కంపెనీ ప్లాంట్ నుంచి 10 మిలియన్ల ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ బైక్లను తయారు చేశారు. హీరో మోటోకార్ప్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా ఖ్యాతిని నిలుపుకున్న 20వ సంవత్సరం ఇది.
ఏప్రిల్ 2020 నుండి హీరో మోటోకార్ప్ 5 మిలియన్ ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేసింది, అయితే 2019లో తయారు చేసిన 7.83 మిలియన్ల కంటే 15 శాతం తక్కువ. 2019లో కంపెనీ అత్యధికంగా బైకులను ఉత్పత్తి చేసింది.