2023 చివరి నాటికి మరో 5 వేల ఉద్యోగాల కోత.. ఖర్చులను తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం: వోక్స్వ్యాగన్

By S Ashok Kumar  |  First Published Mar 15, 2021, 4:30 PM IST

900 మంది ఉద్యోగులకు ముందస్తు పదవీ విరమణ పథకం ఇవ్వనున్నట్లు, మరికొందరు ఇతర కారణాల వల్ల కంపెనీని నుండి వైదొలగుతారని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. 


 2023 చివరి వరకు 5,000 ఉద్యోగాలను తొలగించెందుకు యోచిస్తున్నట్లు కార్ల తయారీ సంస్థ వోక్స్వ్యాగన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల ఫైనాన్సింగ్‌లో   ఖర్చులను తగ్గించుకునేందుకు  కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 

900 మంది ఉద్యోగులకు ముందస్తు పదవీ విరమణ పథకం ఇవ్వనున్నట్లు, మరికొందరు ఇతర కారణాల వల్ల కంపెనీని నుండి వైదొలగుతారని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఉద్యోగులను తొలగించడం వెనుక ఉన్న అతి పెద్ద కారణం ఏమిటంటే, సంస్థ దాని ఖర్చులు, వ్యయాలు తగ్గించుకోవాల్సి ఉంది. 

Latest Videos


ఎలక్ట్రోమోబిలిటీ అండ్ డిజిటలైజేషన్ విస్తరణలో మా అధిక స్థాయి పెట్టుబడులకు కంపెనీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని కంపెనీ హ్యూమన్ రిసోర్సెస్ డైరెక్టర్ గున్నార్ కైలియన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆటోమోటివ్ ట్రాన్స్ఫర్మేషన్  మార్గదర్శకుడిగా వోక్స్వ్యాగన్ తనను తాను నిలబెట్టుకోగలిగింది అని అన్నారు.

also read కియాకి పోటీగా పవర్ ఫుల్ డిజైన్, బెస్ట్ ఫీచర్స్ తో హ్యుందాయ్ కొత్త కార్ ఫస్ట్ లుక్.. ...

ఇప్పుడు మేము మా బలం బలోపేతం చేయాలనుకుంటున్నాము. భవిష్యత్తులో అవసరమైన పెట్టుబడులకు ఆర్థిక సహాయం చేయడానికి కఠినమైన ఖర్చుల నిర్వహణను కొనసాగించడం అవసరమని ఆయన పేర్కొన్నారు. టొయోటా కారణంగా 2020 సంవత్సరంలో వోక్స్వ్యాగన్ ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్లో అగ్రస్థానాన్ని కోల్పోయింది.  

కరోనా వైరస్ కారణంగా వోక్స్వ్యాగన్ కంపెనీ ఇతర ఆటో కంపెనీల లాగానే ఆర్థికంగా ప్రభావితమైంది, అయితే 2021లో వ్యాపారాన్ని పూర్వ స్థాయిని పెంచుతుందని కంపెనీ తెలిపింది.  2030 నాటికి కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల యూరోపియన్ అమ్మకాలలో 70 శాతం విక్రయిస్తుందని భావిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

యూరోపియన్ యూనియన్‌లో కఠినమైన పర్యావరణ నిబంధనలను పాటించటానికి వోక్స్వ్యాగన్ గ్రూప్ 30 బిలియన్ యూరోలకు పైగా ఇ-మొబిలిటీలో పెట్టుబడి పెట్టిందని  కంపెనీ తెలిపింది. 
 

click me!