ప్రపంచంలోనే అతిపెద్ద ఇ-స్కూటర్ ఫ్యాక్టరీని నిర్మించనున్న ఓలా.. బెంగుళూరు సమీపంలోని 500 ఎకరాల్లో ఏర్పాటు..

Ashok Kumar   | Asianet News
Published : Mar 08, 2021, 02:45 PM IST
ప్రపంచంలోనే అతిపెద్ద ఇ-స్కూటర్ ఫ్యాక్టరీని నిర్మించనున్న ఓలా..  బెంగుళూరు సమీపంలోని 500 ఎకరాల్లో ఏర్పాటు..

సారాంశం

క్యాబ్ కంపెనీ ఓలా సుమారు  500 ఎకరాల భూమిలో ఈ కర్మాగారాన్ని నిర్మించనున్నారు. ఓలా అధినేత భవష్ అగర్వాల్ ఇప్పటికే ఈ భూమిని సందర్శించారు. 

ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యాక్టరీని బెంగళూరు నగరానికి కొద్ది దూరంలో నిర్మించబోతోంది. క్యాబ్ కంపెనీ ఓలా సుమారు  500 ఎకరాల భూమిలో ఈ కర్మాగారాన్ని నిర్మించనున్నారు.

ఓలా అధినేత భవష్ అగర్వాల్ ఇప్పటికే ఈ భూమిని సందర్శించారు. రాబోయే 12 వారాల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తవుతుందని ఆయన భావిస్తున్నారు. ఈ కర్మాగారంలో ప్రతి సంవత్సరం సుమారు 10 మిలియన్ ఇ-స్కూటర్లు తయారు చేయనున్నారు.

ఈ ప్రాంతం బెంగళూరు నగరం నుండి రెండున్నర గంటల ప్రయాణంలో ఉంది. ఈ ఫ్యాక్టరీ కోసం సుమారు 330 మిలియన్లు అంటే  భారత కరెన్సీలో దాదాపు రూ .2,417 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారు.

గత 10 సంవత్సరాల్లో ఓలా భారతదేశంలో ప్రయాణీకుల రవాణా వ్యాపారంలో గణనీయమైన విజయాన్ని సాధించింది. మరోవైపు ఓల సంస్థ త్వరలోనే కార్ల తయారీ వ్యాపారంలోకి రాబోతోంది.

also read మీ పాత కార్లను వొదిలించుకోండి.. కొత్త వాహనంపై 5 శాతం రిబేటు పొందండి: నితిన్ గడ్కరీ ...

ఈ ఫ్యాక్టరీ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడి  'మేక్ ఇన్ ఇండియా' కల సాకారం అవుతుందని భావిష్ భావిస్తున్నారు. ఎందుకంటే భారతదేశంలోనే కాదు ఓలా ఎలక్ట్రిక్ ప్రపంచవ్యాప్తంగా ఇ-స్కూటర్లను తక్కువ ధరలకు పంపిణీ చేయనుంది.

ఓలా  కర్మాగారానికి 'ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్' అని పేరు పెట్టారు. ఈ ఫ్యాక్టరీ సంవత్సరానికి 10 మిలియన్ ఇ-స్కూటర్లను ఉత్పత్తి చేయాలని  కంపెనీ ఆశిస్తోంది. 2022 వేసవి నాటికి ప్రపంచంలోని ఈ-స్కూటర్ ఉత్పత్తిలో 15 శాతం కంపెనీ చేతిలో ఉంటుందని భావిస్తున్నారు.

ఈ ఏడాది చివరి నాటికి ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభించాలని ఓలా భావిస్తుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన వాహన తయారీదారులు ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్ల మార్కెటింగ్ ప్రారంభించాయి. 
 

PREV
click me!

Recommended Stories

Maruti Invicto : ఈ కారుపై డిస్కౌంటే రూ.2,15,000 .. అదిరిపోయే ఇయర్ ఎండ్ ఆఫర్
Tata Tiago EV : ఈ కారుపై డిస్కౌంటే రూ.1,65,000 .. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సొంతం చేసుకొండి