వచ్చే ఏడాది హార్లీ డేవిడ్సన్ ఎలక్ట్రిక్ ‘లైవ్ వైర్’

By rajesh yFirst Published Jul 15, 2019, 10:50 AM IST
Highlights


ప్రముఖ మోటారు బైక్ సంస్థ  హార్లీ డేవిడ్సన్ తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ‘లైవ్ వైర్’ను మార్కెట్లోకి తేనున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. 

న్యూఢిల్లీ: ప్రముఖ అమెరికా మోటారు సైకిళ్ల తయారీ సంస్థ ‘హార్లీ డేవిడ్సన్’ సైతం ఎలక్ట్రిక్ మోటారు సైకిళ్ల రేంజిలో పోటీ పడేందుకు సిద్ధం అవుతుంది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ స్పేస్‌లో అడుగు పెట్టేందుకు తహతహలాడుతోంది. వచ్చే ఏడాది తొలి ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్‌ లైవ్ వైర్‌ను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఉత్పత్తి చేయనున్న ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్‌ లైవ్ వేర్‌ను ‘కన్జూమర్ ఎక్మా షో 2018’లో ప్రదర్శించింది.

పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడానికి సంసిద్ధమవుతున్నది. అంతే కాదు తొలి విద్యుత్ మోడల్ బైక్ కోసం ప్రీ ఆర్డర్లను కూడా ఆహ్వానిస్తామని ప్రకటించింది. ఈ లైవ్ వైర్ బైక్ ధర 30 వేల అమెరికా డాలర్లు (రూ.20.56 లక్షలు) ఉంటుందని కూడా తెలిపింది. ‘హెచ్-డీ’ కనెక్ట్ వంటి టెలిమాటిక్స్ సిస్టమ్‌తో అధునాతన ఫీచర్లతో లైవ్ వైర్ బైక్‌ను మార్కెట్లోకి తీసుకొస్తామని హార్లీ డేవిడ్సన్ పేర్కొంది. 

ఈ టెక్నాలజీ ద్వారా హార్లీ’స్ యాప్ సాయంతో బైక్ యజమాని తన వాహనాన్ని చార్జింగ్, సర్వీసింగ్ చేసుకోవచ్చు. ఇతర మోటార్ బైక్ సంస్థల కంటే ముందుగా తొలి సెల్యూలార్ కనెక్టెడ్ ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్‌గా ‘లైవ్ వైర్’ను ఆవిష్కరించేందుకు సిద్ధం అవుతుంది. 

అంతే కాదు హార్లీ డేవిడ్సన్ తన లైవ్ వైర్ బైక్ స్పెషిపికేషన్లను విడుదల చేసింది. పట్టణ ప్రాంతాల్లో 3.5 సెకన్లో ట్రిపుల్ డిజిట్ స్పీడ్‌తో దూసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం. 177 కిలోమీటర్ల రేంజ్ అర్బన్ రైడింగ్ కండీషన్ దీని స్పెషాలిటీ. ట్రాన్సాక్షన్ కంట్రోల్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), ఇంటర్నల్ మెజర్మెంట్ యూనిట్ (ఐఎంయూ) తదితర ఫీచర్లు ఉన్నాయి.

‘సిగ్నేచర్ హార్లీ- డేవిడ్సన్’ బైక్‌లో ఫీచర్లన్నీ ఇందులో లభిస్తాయి. రేర్ సెట్ పెగ్స్, బ్రెంబో కాలిపర్స్, స్టీల్ ట్రెల్లిస్ ప్రేమ్, ఇన్వర్టెడ్ షోవా ఫోర్క్స్, రేర్ మొనోషాక్, మల్టీపుల్ రైడర్ మోడ్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఫుల్ కలర్ టీఎఫ్టీ ఇన్ స్ట్రూమెంట్ కన్సోల్ తదితర ఫీచర్లు జత కలువనున్నాయి. 
 

click me!