ప్రతి 25 కిమీలకు ఒక విద్యుత్ చార్జింగ్ స్టేషన్ మస్ట్

By rajesh yFirst Published Feb 16, 2019, 10:29 AM IST
Highlights

దేశీయంగా విద్యుత్ చార్జీల వినియోగాన్ని వేగవంతం చేసే పనిలో కేంద్రం పడింది. అందుకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనపై కేంద్రీకరించింది. ప్రధానంగా విద్యుత్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాలను రూపొందించింది. ప్రతి 25 కి.మీలకు ఒక విద్యుత్ చార్జింగ్ స్టేషన్ తప్ననిసరి చేసింది. 

న్యూఢిల్లీ: వచ్చే 11 ఏళ్లలో దేశంలోని వాహనాల్లో నాలుగోవంతు విద్యుత్ వాహనాలు ఉంటాయని కేంద్ర హౌసింగ్, పట్టణాభివ్రుద్ధి శాఖ అంచనా వేస్తోంది. కర్బన ఉద్గరాల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ కోసం విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. అయితే వాహనాలను నడిపేందుకు ఇంధనం కావాలిగా. పెట్రోల్ లేదా డీజిల్ స్థానే విద్యుత్ చార్జింగ్ తప్పనిసరి. 

ఆ విద్యుత్ చార్జింగ్ కోసం ప్రతి 25 కిలోమీటర్లకు ఒక విద్యుత్ చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ క్రమంలో విద్యుత్ వాహనాలను నడిపేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన తప్పనిసరి. అందులో చార్జింగ్ స్టేషన్లు కూడా వస్తాయి. 

ఈ క్రమంలో మౌలిక వసతులను మెరుగు పరిచేందుకు ‘మోడల్ బిల్డింగ్ బైలాస్ (ఎంబీబీఎల్) 2016, ‘అర్బన్ రీజనల్ డెవలప్మెంట్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ (యూఆర్డీపీఎఫ్ఐ) 2014’లను కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ శాఖ సవరించేసింది. ఇవే మార్గదర్శకాలు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తిస్తాయి. ఇళ్ల యజమానులు తాజాగా కేంద్రం సవరించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. 

దీర్ఘశ్రేణి, భారీ డ్యూటీ ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ కోసం జాతీయ రహదారులకు ఇరువైపులా ప్రతి 100 కిలోమీటర్లకు ఒక విద్యుత్ చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. నివాస ప్రాంతాల్లోనూ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవచ్చునని కేంద్రం సూచించింది. 
 

click me!