మీ పాత కార్లను వొదిలించుకోండి.. కొత్త వాహనంపై 5 శాతం రిబేటు పొందండి: నితిన్ గడ్కరీ

By S Ashok Kumar  |  First Published Mar 8, 2021, 11:52 AM IST

 2021-22 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన స్వచ్ఛంద వాహన స్క్రాపింగ్ పాలసీ వ్యక్తిగత వాహనాలకు 20 సంవత్సరాల తరువాత, వాణిజ్య వాహనాలు 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఫిట్ నెస్  టెస్ట్ అవసరం.  ఈ పాలసీ కింద కొత్త కారు కొనుగోలు చేసే వారికి ఆటోమొబైల్‌ కంపెనీలు దాదాపు 5 శాతం రిబేటు అందించనున్నారు అని ఆయన తెలిపారు. 


వాహనదారుల పాత వాహనాలను జంక్ చేసే వెహికల్ స్క్రాపింగ్ పాలసీ కింద కొత్త వాహనాలు కొనుగోలు చేసే వినియోగదారులకు  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ  గుడ్ న్యూస్ తెలిపారు.

2021-22 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన స్వచ్ఛంద వాహన స్క్రాపింగ్ పాలసీ వ్యక్తిగత వాహనాలకు 20 సంవత్సరాల తరువాత, వాణిజ్య వాహనాలు 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఫిట్ నెస్  టెస్ట్ అవసరం.  ఈ పాలసీ కింద కొత్త కారు కొనుగోలు చేసే వారికి ఆటోమొబైల్‌ కంపెనీలు దాదాపు 5 శాతం రిబేటు అందించనున్నారు అని ఆయన తెలిపారు. 

Latest Videos

undefined

స్క్రాపేజీ విధానంలో నాలుగు అంశాలు ఉన్నాయి. వాటిలో రిబేటు కూడా ఒకటి. దీనితో పాటు కాలుష్యం వెదజిమ్మే పాత వాహనాలపై హరిత పన్ను మొదలైనవి విధించడం, ఫిట్‌నెస్‌ టెస్టు, పొల్యూషన్‌ టెస్టు చేయించుకోవడం తప్పనిసరి చేయడం మొదలైనవి ఉన్నాయి.

ఈ ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ కేంద్రాలు దేశవ్యాప్తంగా అవసరం ఇందుకు మేము ఆ దిశగా పని చేస్తున్నాము అని గడ్కరీ చెప్పారు.ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ఆటోమేటెడ్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు.

ఇక స్క్రాపింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేయడంలో ప్రైవేట్‌ సంస్థలు, రాష్ట్రాల ప్రభుత్వాలనకు కేంద్రం తగు సహయా సహకారాలు అందిస్తుందని తెలిపారు. టెస్టుల్లో విఫలమైన వాహనాలను నడిపే వారికి భారీ జరిమానాలు విధించడంతో పాటు వాహనాన్ని జప్తు కూడా చేయొచ్చని పేర్కొన్నారు.

ఆటోమేటెడ్ టెస్ట్ లో ఉత్తీర్ణత సాధించని  వాహనాలను నడపడం వల్ల భారీ జరిమానాలు, శిక్షి విధించవచ్చు అని మంత్రి చెప్పారు. ఈ విధానం ఆటోమొబైల్ రంగానికి ఒక వరం కానుంది, అలాగే అత్యంత లాభదాయక రంగాలలో ఒకటిగా మారుతుంది, దీనివల్ల భారీగా ఉపాధి కూడా లభిస్తుంది.

ప్రస్తుతం రూ. 4.5 లక్షల కోట్లుగా ఉన్న దేశీ ఆటోమొబైల్‌ పరిశ్రమ టర్నోవరు.. రాబోయే రోజుల్లో 30 శాతం పైగా వృద్ధి చెందగలదని.. దాదాపు రూ. 10 లక్షల కోట్లకు చేరగలదని గడ్కరీ వివరించారు. టర్నోవరులో రూ.1.45 లక్షల కోట్లుగా ఉన్న ఎగుమతులు.. రూ. 3 లక్షల కోట్లకు చేరగలదన్నారు.

స్క్రాపేజీ పాలసీ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే తుక్కుగా మార్చిన వాహనాల నుంచి.. ఉక్కు, ప్లాస్టిక్, రబ్బరు, అల్యూమినియం వంటి ముడి సరుకు లభ్యత పెరుగుతుందని, దీనితో ఆటోమొబైల్‌ పరికరాల తయారీ ఖర్చులు 30–40 శాతం దాకా తగ్గగలదని గడ్కరీ చెప్పారు.

also read 

ఈ విధానం వల్ల వాహన డిమాండ్ పెరుగుతుంది, దీనివల్ల ఆదాయం పెరుగుతుంది. అలాగే, జంక్ వాహనాలపై అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలు అధిక సంఖ్యలో వస్తాయి. దీంతో ఒక  కోటి కాలుష్య వాహనాలు స్క్రాపింగ్  విధానం కోసం వెళ్తాయని మంత్రి చెప్పారు. ఇందులో 20 ఏళ్లు పైబడిన 51 లక్షలు తేలికపాటి మోటారు వాహనాలు (ఎల్‌ఎంవి) , 15 ఏళ్లు పైబడినవి మరో 34 లక్షల ఎల్‌ఎమ్‌విలు ఉన్నాయి.  వీటిలో 17 లక్షల మీడియం ఇంకా హెవీ మోటారు వాహనాలు ఉన్నాయి.

ఈ చర్య ‘ఆత్మనీర్భర్ భారత్’ ప్రచారానికి ఊపునిస్తుందని  అన్నారు. పార్లమెంటులో 2021-22 బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఈ పథకానికి సంబంధించిన వివరాలను మంత్రిత్వ శాఖతో విడిగా పంచుకుంటామని చెప్పారు.

ఈ విధానం సుమారు 10,000 కోట్ల రూపాయల కొత్త పెట్టుబడులకు దారితీస్తుందని, 50,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తాయని నితిన్ గడ్కరీ చెప్పారు.

ఈ వాహనాలు తాజా వాహనాల కంటే 10-12 రెట్లు ఎక్కువ కాలుష్యానికి కారణమవుతాయని అంచనా. పర్యావరణాన్ని పరిరక్షించడానికి, కాలుష్యాన్ని అరికట్టడానికి త్వరలో  కాలుష్య వాహనాలపై గ్రీన్ టాక్స్ విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది,

అయితే హైబ్రిడ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, సిఎన్జి, ఇథనాల్ అండ్ ఎల్పిజి వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలపై నడుస్తున్న వాహనాలకు మినహాయింపు ఉంటుంది. హరిత పన్ను ద్వారా వసూలు చేసిన ఆదాయాన్ని కాలుష్యా సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించబడుతుంది.

ఈ పథకం కింద ఎనిమిది సంవత్సరాలు పైబడిన  రవాణా వాహనాలకు రోడ్డు పన్నులో 10-25 శాతం చొప్పున ఫిట్‌నెస్ సర్టిఫికేట్ రీనేవల్ సమయంలో గ్రీన్ టాక్స్ వసూలు చేయవచ్చు. 

click me!