కారులో ప్రయాణించేటప్పుడు బ్రేక్ ఫెయిల్ అయ్యిందా.. అయితే ఈ పని చేయండి.. సేఫ్ గా ఉండొచ్చు..

By asianet news telugu  |  First Published Dec 26, 2022, 5:00 PM IST

ఎప్పుడైనా అలాంటి పరిస్థితి మీకు ఎదురైతే భయపడకూడదు. ఇలా జరిగినప్పుడు భయాందోళనలకు బదులుగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి ఇంకా సరైన మార్గంలో కారును ఆపడానికి ప్రయత్నించండి.


ఈ జనరేషన్ కార్లలో సేఫ్టీ కోసం ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. కానీ కదులుతున్న కారులో బ్రేకులు వేసినప్పుడు బ్రేకులు పడకుంటే మాత్రం అందరూ కంగారు పడతారు. అలాంటి సమయాల్లో చాలా తక్కువ మంది మాత్రమే సరైన పద్ధతులను అవలంబించడం ద్వారా కారును సురక్షితంగా ఆపగలుగుతారు. మీరు కూడా కారు నడుపుతుంటే,  తప్పనిసరిగా ఈ సమాచారం తెలిసి ఉండాలి. కారు బ్రేకులు ఫెయిల్ అయితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో దాని గురించి సమాచారం తెలుసుకొండి...

ఎప్పుడైనా అలాంటి పరిస్థితి మీకు ఎదురైతే భయపడకూడదు. ఇలా జరిగినప్పుడు భయాందోళనలకు బదులుగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి ఇంకా సరైన మార్గంలో కారును ఆపడానికి ప్రయత్నించండి. కదులుతున్న కారుకు బ్రేకులు పడకపోతే కారు స్పీడ్ క్రమంగా తగ్గించడం ద్వారా టాప్ గేర్ నుండి మొదటి లేదా సెకండ్ గేర్‌ లోకి కారును తీసుకురావడానికి ప్రయత్నించాలి.

Latest Videos

undefined

బ్రేక్‌ని పదే పదే నొక్కండి
చాలా సార్లు బ్రేకులు పడకపోవడానికి కారణం బ్రేకులపై సరైన ప్రెజర్ పడకపోవడమే. అందుకే మళ్లీ మళ్లీ బ్రేకులు వేయడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇలా పదే పదే చేయడం వల్ల బ్రేకులకు సరైన ప్రెషర్ వచ్చే అవకాశం ఉంది ఇంకా మళ్లీ బ్రేక్‌లు పనిచేయడం ప్రారంభించే అవకాశం ఉంది. ఇంకా  బ్రేకులు వేసి కారుని ఆపవచ్చు.

రివర్స్ గేర్ ఉపయోగించవద్దు
కారును ఆపడానికి రివర్స్ గేర్‌ వేయడం బెస్ట్ అని చాలా మంది అనుకుంటారు. దీని వల్ల కారు ముందుకు వెళ్లకుండా వెనుకకు వెళ్లడం వల్ల కారు ఆగిపోతుంది. కానీ ఇది జరగదు. ఇంకా రివర్స్ గేర్‌ వేయడం వల్ల  ప్రమాదాన్ని పెంచుతుంది.

లైట్లు ఇంకా హారన్ ఉపయోగించండి
రివర్స్ గేర్‌కు బదులుగా కారు లైట్లు ఇంకా హారన్ ఉపయోగించాలి. సాధారణంగా ప్రజలు పగటిపూట కారు హెడ్‌లైట్‌లను ఆన్ చేయరు ఇంకా హారన్‌ను పదే పదే ఉపయోగించరు. కానీ ఎవరైనా కారు హారన్ ఇంకా హెడ్‌లైట్లను పదే పదే ఉపయోగిస్తే, అది ఇతర డ్రైవర్ల దృష్టిలోకి వస్తుంది. అందువల్ల కారు బ్రేక్‌లు పనిచేయకపోతే లైట్ అండ్ హారన్‌తో పాటు కారు ఫోర్ ఇండికేటర్స్ ఉపయోగించండి, ఇలా చేయడం వల్ల ఇతర కార్లకు సిగ్నల్ వస్తుంది.

హ్యాండ్‌బ్రేక్‌ ఎప్పుడు ఉపయోగించాలి
బ్రేక్‌లతో పాటు, కారులో హ్యాండ్‌బ్రేక్ కూడా ఉంటుంది. బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు హ్యాండ్‌బ్రేక్  తప్పుగా ఉపయోగించడం హానికరం, కానీ సరైన సమయంలో ఉపయోగిస్తే, అది కారును ఆపడానికి సహాయపడుతుంది. అటువంటి పరిస్థితిలో కారు స్పీడ్‌లో ఉన్నప్పుడు హ్యాండ్‌బ్రేక్‌ను ఉపయోగించకూడదు లేకపోతే కారు బోల్తా పడే అవకాశం ఉంది. హ్యాండ్‌బ్రేక్‌ని ఉపయోగించే ముందు కారును గంటకు 30 నుండి 40 కి.మీ స్పీడ్ లోకు తీసుకొచ్చి ఆపై దాన్ని ఉపయోగించడానికి ప్రయత్నించండి. దీనితో పాటు, ముందు-వెనుక, కుడి-ఎడమ ఇతర వాహనాలు ఉండకుండ  గుర్తుంచుకోవాలి.

ఆఫ్ రోడ్ 
కారు బ్రేక్ ఫెయిల్ అయిన సమయంలో కారును రోడ్డు నుండి దూరంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే రోడ్డుపై వెళ్లే ఇతర వాహనాలు ఢీకొనే ప్రమాదం ఉంది. కానీ రోడ్డుకు సమీపంలో ఎక్కడైనా ఇసుక ఉన్న రోడ్డు లేదా మట్టి ఉండే ప్రదేశంలోకి తీసుకెళ్ళడం ద్వారా  వేగాన్ని తగ్గించడంలో ఇంకా కారును ఆపడానికి సహాయపడుతుంది.

పోలీసులకు సమాచారం ఇవ్వండి
ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడల్లా పోలీసుల సహాయం తీసుకోవడం మంచిది. పోలీసు హెల్ప్‌లైన్‌కు కాల్ చేయడం ద్వారా బ్రేక్ ఫెయిల్ గురించి సమాచారం ఇవ్వండి ఇంకా మీ లొకేషన్ కూడా తెలియజేయండి. ఇలా చేయడం ద్వారా మీరు సమీపంలోని PCR అండ్ అంబులెన్స్ నుండి సహాయం పొందవచ్చు. దీనితో పాటు మీ వాహనం ఇతర వాహనాలను ఢీకొనకుండా చూసేందుకు పోలీసులు ప్రయత్నించగలరు.
 

click me!