బీఎండబ్ల్యూ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ వైరల్.. ఇండియాలోనే తయారీ..

By Ashok Kumar  |  First Published Jul 31, 2024, 5:43 PM IST

బీఎండబ్ల్యూ నుంచి ఓ చిన్న స్కూటర్ మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు వస్తోంది. రిపోర్ట్స్  ప్రకారం, కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ BMW CE 02 త్వరలో ఇండియాలో విడుదల కానుంది.
 


కార్ బ్రాండ్ BMW నుండి ఒక చిన్న స్కూటర్ ఇండియన్ మార్కెట్లో సెన్సేషన్  సృష్టించడానికి వస్తోంది. రిపోర్ట్స్  ప్రకారం కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ BMW CE 02 త్వరలో ఇండియాలో లాంచ్ కానుంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ స్కూటర్ భారత్ లోనే తయారు చేయబడింది. అందువల్ల దీనిని బడ్జెట్ మోడల్  అని భావిస్తున్నారు. కానీ టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటీ కంటే ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ BMW CE 02 వివరాలను వివరంగా తెలుసుకుందాం... 

ఇండియాలో BMW తయారీ పార్ట్నర్  TVS మోటార్ భారతదేశంలో బైక్‌ను టెస్టింగ్ చేస్తున్నట్లు గత సంవత్సరం వార్తలు వచ్చాయి. ఆగస్టు 2023లో కర్ణాటకలోని శృంగేరిలో పబ్లిక్ లొకేషన్‌లో రెండు CE 02 టెస్ట్ మోడల్‌లు కనిపించాయి. BMW CE 02 ఎలక్ట్రిక్ స్కూటర్ డబుల్-లూప్ ట్యూబ్యులర్ ఫ్రేమ్‌తో విభిన్నమైన, ఫ్యూచర్  డిజైన్‌తో ఉంటుంది. దీనికి ముందు వైపున అప్‌సైడ్ డౌన్ ఫోర్క్, వెనుక వైపున మోనో షాక్ సెటప్‌ ఉంది. బైక్‌లో సింగిల్-సైడెడ్ స్వింగ్‌ఆర్మ్, ముందువైపు 296ఎమ్ఎమ్ డిస్క్, సింగిల్-ఛానల్ ABS ఉన్నాయి.

Latest Videos

undefined

BMW CE 02 15bhp ఎలక్ట్రిక్ మోటార్‌తో డ్యూయల్ 2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే గరిష్టంగా 95 కి.మీ/గం, 90 కి.మీల స్పీడ్ అందుకోగలదని తెలిపింది. BMW 2 కిలోవాట్ బ్యాటరీలలో ఒకదాన్ని రిమూవబుల్ చేసే ఛాన్స్  కూడా అందిస్తుంది. అయితే ఒక బ్యాటరీ తీసేస్తే మైలేజ్ 45 కి.మీకి పడిపోతుంది. కాగా, టాప్ స్పీడ్ గంటకు 45 కి.మీ ఉంటుంది. 

స్టాండర్డ్  0.9 kW ఛార్జర్‌ని ఉపయోగించి 5 గంటల 12 నిమిషాలలో బ్యాటరీని 0 నుండి 100% వరకు ఛార్జ్ చేయవచ్చు. దీనిని 1.5 kW ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించి కూడా ఛార్జ్ చేయవచ్చు. ఇందుకు సమయం మూడు గంటల 30 నిమిషాలకు పడుతుంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం ధర ప్రపంచ మార్కెట్‌లో 7.6k USD (దాదాపు రూ. 6.3 లక్షలు) నుండి ప్రారంభమవుతుంది.

కొత్త BMW CE 02 ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ సంవత్సరం చివరి నాటికి భారతదేశంలోకి రానుంది. దీనికి ఎంత ఖర్చవుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంటే ఖరీదైనది కావడం ఖాయం. ఇటీవలే, BMW  పెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ CE 04ను భారతదేశంలో విడుదల చేసింది. జర్మనీలో తయారైన ఈ స్కూటర్‌ను భారతదేశంలో భారీ ధరకు విక్రయిస్తున్నారు. కానీ CE 02 భారతదేశంలో మాత్రమే తయారు చేయబడింది. కాబట్టి దీని ధర తక్కువగా ఉంటుంది. BMW ఇంతకుముందు భారతదేశంలో పెద్ద స్కూటర్ C400 GTని విడుదల చేసింది. దీని ధర కూడా చాలా ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పటికీ బాగా అమ్ముడవుతోంది. అందువల్ల, BMW CE 04 భారతదేశంలో ప్రవేశపెట్టారు. CE 04, రాబోయే CE 02 ప్రజలు ఎంత వరకు  ఆదరిస్తారో చూడాలి.

click me!