
శనిసంచారం జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ముఖ్యమైనది. శని దేవుడు ప్రస్తుతం ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నాడు. అక్టోబర్ 2025లో శని దేవుడు గురువు నక్షత్రమైన పూర్వాభాద్రపద నక్షత్రంలోకి అడుగు పెడతాడు. ఆ నక్షత్రానికి అధిపతి దేవగురువైన బృహస్పతి. ఇతడు జ్ఞానం, మతం, ఆరాధన వంటి వాటికి కారకుడు. ఈ శని దేవుడు కర్మకు, న్యాయానికి కారకుడు. శని గ్రహం బృహస్పతికి చెందిన పూర్వాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారు అదృష్టవంతులుగా మారుతారు. శని.. నక్షత్రం మారడం అనేది కొంతమందికి ఎన్నో ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే సమాజంలో గౌరవాన్ని పెంచుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చేలా చేస్తుంది. ముఖ్యంగా అక్టోబర్ నెలలో మూడు రాశుల వారికి శని వల్ల అదృష్టం పట్టబోతుంది. ఆ మూడు రాశులు ఎవరో తెలుసుకోండి.
వృషభ రాశి వారికి శనిరాశిలో మార్పు ఆనందానికి మార్గం వేయబోతోంది. వీరి ఆదాయం పెరుగుతుంది. అలాగే వీరి కొత్త ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. ఉద్యోగం చేసే వారికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. వీరికి సమాజంలో మంచి పేరు వస్తుంది. ప్రజలు వీరి పనులను అభినందిస్తారు. వారిలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. వ్యాపారం చేసే వారికి అధిక మొత్తంలో లాభాలు వస్తాయి. ఆర్థికంగాను వీరికి అన్ని రకాలుగా కలిసివస్తుంది.
మిధున రాశి వారికి అక్టోబర్ అన్ని రకాలుగా కలిసి వచ్చే కాలం. శనిగ్రహం నక్షత్రం మార్చుకోవడం వల్ల వీరికి అన్నీ శుభాలే కలుగుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఉపాధిలో కూడా వీరు మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వీరి ఉద్యోగ అన్వేషణ కూడా పూర్తవుతుంది. మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరి పని శైలి, కమ్యూనికేషన్ నైపుణ్యాలతో ఇతరులను ఆకట్టుకుంటారు. విద్య, ఆరోగ్య రంగంలో పనిచేసే వ్యక్తులకు పదోన్నతులు వస్తాయి. వీరిలో ఆత్మవిశ్వాసము పెరుగుతుంది. కాబట్టి శని దేవుడు వీరికి అన్ని రకాలుగా అక్టోబర్లో మేలే చేస్తాడు.
ఇక మకర రాశి వారికి కూడా శని నక్షత్రం మార్పు అన్ని రకాలుగా కలిసి వచ్చేలా చేస్తుంది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అదృష్టాన్ని తెస్తుంది. మకర రాశి వారు కొంచెం కష్టపడినా చాలు... మంచి ఫలితాలను పొందుతారు. ఉన్నత విద్యలో వీరు ముందుకు వెళతారు. మీరు వైవాహిక జీవితం కూడా ఆనందంగా కొనసాగుతుంది. జీవిత భాగస్వామితో ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు. తోబుట్టువులతో కూడా ఆనందంగా ఉంటారు. కుటుంబ సంబంధాలు బలంగా మారుతాయి. అకస్మాత్తుగా డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది.