దుస్తులు దానం చేస్తే ఏమౌతుందో తెలుసా?

By Shivaleela RajamoniFirst Published Jul 9, 2024, 10:46 AM IST
Highlights

అన్నం, డబ్బులతో పాటుగా కొందరు బట్టలు కూడా దానం చేస్తుంటారు. కానీ బట్టలను దానం చేయొచ్చా? ఒకవేళ దానం చేస్తే ఏమౌతుందో తెలుసా? 
 

దానం చేయడంలో వచ్చే ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. దానం అనే మాట చిన్నదే అయినా.. ఇది మనస్సుకు ఆనందాన్నిస్తుంది. అందుకే చాలా మంది వారికి చేతనైన దానం చేస్తుంటారు. కొందరు అన్నం దానం చేస్తే.. మరికొందరు దుస్తులు దానం చేస్తుంటారు.  

చాలా మంది ఖరీదైన వస్తువులను కొంటుంటారు. కానీ రెండు మూడు సార్లు తొడిగి ఓ మూలకు పడేస్తారు. కానీ అందరికీ ఇలా ఉండదు. కొందరు కొత్త బట్టలు కొనే స్థితిలో ఉండరు. ఇలాంటి వారు మనకు మన చుట్టు ముట్టు కనిపిస్తూనే ఉంటారు. ఇలాంటి వారికి బట్టల దానం చేయడంలో వచ్చే పుణ్యం  మరేదానిలో రాదంటారు పెద్దలు. పేదవాళ్లకు లేదా బట్టలు లేనివాళ్లకు బట్టల దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం దక్కుతుంది. దుస్తులు దానం చేయడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

Latest Videos

దుస్తుల దానం చేయడం వల్ల కుజ దోషం తొలగిపోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దుస్తులను దానం చేయడం వల్ల దాత ఇంట్లో ముందస్తు మరణాలు సంభవించే ప్రమాదాలు కూడా ఉండవని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

అలాగే దానం చేసేవారికి కుటుంబానికి లక్ష్మిదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో ప్రారంభించినా కొందరికి ఆటంకాలు ఎదరవుతూనే ఉంటాయి. ఇలాంటి వారు దుస్తులను దానం చేయడం వల్ల మీరు చేపట్టిన ప్రతి పని విజయవంతమవుతుంది. సంక్రాతి, దీపావళి లేదా మీ పుట్టినరోజు లేదా కుటుంబ సభ్యుల పుట్టినరోజున కొత్త దుస్తులను దానం చేయడం వల్ల మీకు అంతా మంచే జరుగుతుంది. 

కానీ ఫెస్టివల్ కు, బర్త్ డే పార్టీలకు మీరు వేసుకున్న బట్టలను మాత్రం దానం చేయకూడదు. ఇలాంటి దుస్తులను దానం చేసినా మీకు ఎలాంటి పుణ్యం దక్కదు. దానధర్మాలు ప్రతిఫల చర్య కాదు. ఎదుటివారి ముఖాల్లో సంతోషాన్ని నింపడం. 
 

click me!