Latest Videos

ఆషాడం 2024: ఆషాడం వచ్చేసింది... ఈ చెట్టును పూజిస్తే... మీకు విజయమే..!

By ramya SridharFirst Published Jun 22, 2024, 11:08 AM IST
Highlights

ఈ మాసం ఆ విష్ణుమూర్తిని ఏ అవతారంలో పూజించినా మంచి జరుగుతుందని నమ్ముతారు. అంతేకాదు.. ఈ మాసంలో ఎలాంటి దానదర్మాలు చేసినా.. శుభం జరుగుతుందని కూడా నమ్ముతారు.

హిందూ క్యాలెండర్ ప్రకారం వచ్చే మూడో నెల ఆషాడమాసం. వర్షాకాలం రాగానే వచ్చే మాసం ఇది. ఈ మాసంలో సూర్యుడు మిథున రాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఈ ఆషాడ మాసాన్ని విష్ణుమూర్తికి అంకితం చేశారు. ఈ మాసం ఆ విష్ణుమూర్తిని ఏ అవతారంలో పూజించినా మంచి జరుగుతుందని నమ్ముతారు. అంతేకాదు.. ఈ మాసంలో ఎలాంటి దానదర్మాలు చేసినా.. శుభం జరుగుతుందని కూడా నమ్ముతారు.

నిజానికి.. ఈ ఆషాడ మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. పెళ్లిళ్లు, గ్రుహ ప్రవేశాలకు ఈ మాసం మంచిదికాదు అంటారు. కానీ.. ఈ మాసానికి కూడా విశిష్టత ఉంది. ఈ ఆషాడ మాసంలో  కొన్ని రకాలు పూజలు ముఖ్యంగా అరటి చెట్టును పూజించడం వల్ల.. మన కష్టాలు అన్నీ తొలగిపోతాయట. విజయం కోసం ఎధురుచూస్తున్న వారికి కూడా విజయం వరిస్తుందట.

ఈ మాసంలో అరటిచెట్టును పూజించడం వల్ల కలిగే లాభాలు ఇవే.. 

అరటి చెట్టును పూజించే విధానం..
ఆషాఢ మాసంలో ఏదైనా గురువారం రోజున అరటి చెట్టును పూజించడం శుభప్రదంగా భావిస్తారు.
మీరు మీ సౌలభ్యం ప్రకారం సూర్యోదయం తర్వాత ఎప్పుడైనా ఎంచుకోవచ్చు.
అరటి చెట్టును శుభ్రం చేసి దాని మూలాల్లోకి నీరు పోయాలి.
చెట్టు కొమ్మను గంగాజలంతో కడిగి తుడవాలి.
కాండం మీద చందనం, , పసుపు కలిపి పేస్ట్ చేయాలి.
చెట్టు ట్రంక్‌పై 5 లేదా 7 సార్లు ఎర్రటి దారాన్ని కట్టండి.
ముందుగా గణేశుడిని, విష్ణువును పూజించండి.
అప్పుడు అరటి చెట్టును విష్ణుమూర్తి స్వరూపంగా భావించి పూజించండి.
అనంతరం.. చెట్టుకు కాలానుగుణ పండ్లు, పువ్వులు, దీపాలను సమర్పించండి.
నెయ్యి దీపం వెలిగించి కర్పూర హారతి చేయండి.
కొబ్బరికాయ కొట్టి, తాంబూలం సమర్పించాలి.
"ఓం నమో నారాయణాయ" అనే మంత్రాన్ని 11, 21 లేదా 108 సార్లు జపించండి.
మీరు "కేలేశ్వర స్తోత్రం" కూడా పఠించవచ్చు.
పూజ తరువాత, అరటి చెట్టుకు నీరు సమర్పించండి.

ఇలా ఆషాడమాసంలో అరటి మొక్కను పూజించడం వల్ల చాలా పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఎందుకంటే... అరటి చెట్టు విష్ణువు  చిహ్నంగా పరిగణిస్తారు. ఆషాఢమాసంలో విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజిస్తారు. హిందూమతంలో చెట్లను దేవతలకు నిలయంగా పరిగణిస్తారు. ఈ వృక్షాన్ని పూజించడం వల్ల సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయి. ఆషాఢమాసంలో గ్రహాల స్థానం శుభప్రదం. అరటి చెట్టును పూజించడం వల్ల గ్రహాల శుభాలు కలుగుతాయి. జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. సుఖ సంతోషాలు లభిస్తాయి. కోరుకున్న విజయం కూడా వరిస్తుంది.

click me!