ఉదయం లేవగానే కొంతమంది హడావుడిగా ఇంటి పనులు చేస్తుంటారు. మరికొంతమంది అరచేతులను చూసుకుంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం.. ఉదయం లేవగానే మూడింటిని మాత్రం అస్సలు చూడకూడదు. ఎందుకంటే ఇది మీకు సమస్యలను కలిగిస్తుంది.
వాస్తుశాస్త్రం ప్రకారం.. మన రోజు బాగా ప్రారంభమైతేనే మనకు రోజంతా బాగుంటుంది. మన పనులను కూడా చకచకా చేసుకోగలుగుతాం. ఎనర్జిటిక్ గా రోజును కంప్లీట్ చేస్తాం. కానీ మనం చేసే కొన్నిచిన్న చిన్న పొరపాట్లు మనల్ని రోజంతా ప్రశాంతంగా ఉండనీయవని వాస్తుశాస్త్రం చెబుతోంది. కొన్ని కొన్ని సార్లు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు అనుకోని సమస్యలు వచ్చిపడుతుంటాయి. ఇది మన మూడ్ ను పాడు చేస్తుంది. దీనికి కారణం ఉదయం నిద్రలేచిన వెంటనే ఏదో ఒక పనిచేయడమేనని వాస్తు శాస్త్రం చెబుతోంది.
వాస్తు శాస్త్రంలో ఉదయం లేవగానే మనం చూడకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి. ఉదయం నిద్రలేచిన తర్వాత వీటిని చూడటం వల్ల అశుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు. అంతేకాకుండా ఇవి మనకు ఆర్థిక సమస్యలు వచ్చేలా కూడా చేస్తాయి. అందుకే వాస్తు ప్రకారం ఉదయం చూడకూడని వస్తువులేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నీడలు: వాస్తు శాస్త్రం ప్రకారం.. ఉదయం నిద్రలేవగానే మీ నీడను లేదా వేరేవాళ్ల నీడలను పొరపాటున కూడా చూడకూడదు. సూర్యదర్శన సమయంలో పడమటి దిశలో ఉన్న నీడను చూడటం అశుభంగా భావిస్తారు. దీనివల్ల అంతా చెడే జరుగుతుందని చెప్తారు. అందుకే ఉదయం నిద్రలేవగానే నీడలను మాత్రం చూడకండి.
మురికి పాత్రలు: వాస్తు శాస్త్రం ప్రకారం.. రాత్రి అందరూ తిన్న తర్వాత ఇంటింట్లో ఉన్న మురికి పాత్రలను అప్పుడే శుభ్రం చేస్తే అన్నపూర్ణదేవి అనుగ్రహం లభిస్తుంది. దీనివల్ల మీ ఇంట్లోకి నెగిటీవ్ ఎనర్జీ కూడా రాదు. కానీ మీరు రాత్రిపూట తిన్న పాత్రలను కడగకుండా వాటిని ఉదయం చూడటం మంచిది కాదు. ఇది మీ రోజును పాడు చేస్తుంది. అలాగే మీరు జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మిమ్మల్ని పేదరికం బారిన పడేస్తుంది. అందుకే రాత్రిపూటే పాత్రలను తోమండి.
అద్దంలో చూడొద్దు: చాలా మందికి ఉదయం నిద్రలేవగానే అద్దంలో చూసుకునే అలవాటు ఉంటుంది. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే ప్రతికూల శక్తులన్నీ మీలోకి ప్రవేశిస్తాయి. దీంతో మీ రోజు ఉత్సాహంగా ఉండదు. పనులు ముందుకు సాగవు. అలాగే మిమ్మల్ని పేదరికం వెంటాడుతుంది.