19 అక్టోబర్ 2018 శుక్రవారం రాశిఫలాలు

By ramya neerukonda  |  First Published Oct 19, 2018, 6:55 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : వృత్తి ఉద్యోగాదుల్లో  ఒత్తిడి ఏర్పడుతుంది. పనుల్లో ఆటంకాలు వస్తాయి. అధికారులతో అప్రమత్తత అవసరం. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కార్యాల్లో జయం కలుగుతుంది. సుబ్రహ్మణ్య పారాయణ మంచి ఫలితాలిస్తుంది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. అనవసర ఇబ్బందులు వచ్చే సూచనలు. పరిశోధకులు జాగ్రత్తగా ఉండాలి. అన్ని పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఆలోచనల్లో మార్పు అవసరం. సుబ్రహ్మణ్య పారాయణ మంచి ఫలితాలిస్తుంది.

Latest Videos

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. పనుల్లో ఆటంకాలు వస్తాయి. ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. అనారోగ్య సూచనలు కనిపిస్తాయి. తొందరపాటు పనికిరాదు. క్రయవిక్రయాల్లో జాగ్రత్త అవసరం. సుబ్రహ్మణ్య పారాయణ మంచి ఫలితాలిస్తుంది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : నూతన పరిచయాల వల్ల ఒత్తిడి. పనుల్లో ఆటంకాలు ఉంటాయి.  పట్టుదలతో కార్యసాధన అవసరం. భాగస్వామ్య అనుబంధాల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేయాలి.   గౌరవంకోసం ప్రయత్నిస్తారు. సుబ్రహ్మణ్య పారాయణ మంచి ఫలితాలిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నం చేస్తారు. శత్రువులపై విజయం ఉంటుంది. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. ఋణబాధలు తీరుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వృత్తి విద్యలపై ఆసక్తి ఉంటుంది. యుద్దాలకై ఆలోచిస్తారు. సుబ్రహ్మణ్య పారాయణ మంచి ఫలితాలిస్తుంది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సంతాన సమస్యలు అధికం అవుతాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. చిత్త చాంచల్యం అధికం. పనుల్లో ఒత్తిడులు ఏర్పడతాయి. విద్యార్థులకు కష్టకాలం. ఆత్మీయత లోపిస్తుంది.  ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. పరిపాలన సమర్ధత ఉంటుంది. సుబ్రహ్మణ్య పారాయణ మంచి ఫలితాలిస్తుంది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : ఒత్తిడితో సౌకర్యాలు పూర్తి చేసుకుటాంరు. సౌకర్యాల వల్ల చికాకులు వస్తాయి. మానసిక ప్రశాంతత ఉండదు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. చిత్త చాంచల్యం తక్కువ. ఆహారంలో సమయ పాలన తప్పనిసరి. విద్యార్థులు శ్రమతో ఒత్తమ ఫలితాల సాధన. సుబ్రహ్మణ్య పారాయణ మంచి ఫలితాలిస్తుంది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సోదర వర్గీయుల సహకారం లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సంతృప్తి లభిస్తుంది. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.   సంతృప్తి ఏర్పడుతుంది. సుబ్రహ్మణ్య పారాయణ మంచి ఫలితాలిస్తుంది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వాగ్దానాల వల్ల ఇబ్బందులు. మాట విలువ తగ్గుతుంది. మాటల్లో కాఠిన్యత పెరుగుతుంది. కుటుంబంలో చికాకులు ఏర్పడతాయి. అన్ని పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. జాగ్రత్త అవసరం. మౌనంగా ఉండడంమంచిది. సుబ్రహ్మణ్య పారాయణ మంచి ఫలితాలిస్తుంది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శారీరక శ్రమ ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాట పడతారు. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. కార్యసాధనలో పట్టుదల అవసరం. గొడవల జోలికి పోకూడదు. అహంకారాన్ని తగ్గించుకోవాలి. శారీరక బలం పెరుగుతుంది. సుబ్రహ్మణ్య పారాయణ మంచి ఫలితాలిస్తుంది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. అనవసర ఒత్తిడి ఏర్పడుతుంది. సుఖం కోసం ఆలోచన పెరుగుతుంది. మానసిక ప్రశాంతత పెంచుకోవాలి. అనుకున్న పనులు పూర్తి చేయాలి. అనవసర ఖర్చుల జోలికి పోరాదు. పాదాల నొప్పులు ఉంటాయి. సుబ్రహ్మణ్య పారాయణ మంచి ఫలితాలిస్తుంది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సమిష్టి ఆశయాలు నెరవేరుతాయి. కళాకారులకు ఒత్తిడి ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఉపాసనపై దృష్టి ప్టోలి. కంపెనీల్లో ఆదాయాలు పెంచుకునే సమయం. సుబ్రహ్మణ్య పారాయణ మంచి ఫలితాలిస్తుంది.

డా.ఎస్.ప్రతిభ

click me!