ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు ఉంటాయి. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. సంఘంలో గౌరవ మర్యాదలు పెరచుకుటాంరు. కీర్తి ప్రతిష్టలపై కాంక్ష ఉంటుంది. పెద్దలంటే గౌరవం పెరుగుతుంది. దుర్గా ఆరాధన, సుబ్రహ్మణ్యస్వామి పూజ ఉపకరిస్తాయి.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : శుభకార్యాల్లో పాల్గొనే ఆలోచన ఉంటుంది. పరిశోధనల వల్ల ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులకు కష్టకాలం. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. విశాలభావాలు ఉంటాయి. అధికారులతో అననుకూలత ఏర్పడుతుంది. శివారాధన, గణపతి ఆరాధన, దుర్గాస్తోత్రపారాయణ మంచి ఫలితాలనిస్తాయి.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : ఊహించని ఇబ్బందులుటాంయి. అనుకోని కష్టాలు వస్తాయి. శ్రమలేని సంపాదనపై దృష్టి పెడతారు. చిత్త చాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. శివారాధన, గణపతి ఆరాధన, దుర్గాస్తోత్రపారాయణ మంచి ఫలితాలనిస్తాయి.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. పదిమందిలో గౌరవంపెంచుకునే ప్రయత్నం. భాగస్వామ్య అనుబంధాలు వృద్ధి చెందుతాయి. అనారోగ్య భావన పెరుగుతుంది. జాగ్రత్త అవసరం. శివారాధన, గణపతి ఆరాధన, దుర్గాస్తోత్రపారాయణ మంచి ఫలితాలనిస్తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : శత్రువులపై విజయం ఉంటుంది. పోటీల్లో కష్టపడి గెలుపు సాధిస్తారు. ఋణ సంబంధ ఆలోచనల వల్ల విముక్తి కలుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం. వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. శివారాధన, గణపతి ఆరాధన, దుర్గాస్తోత్రపారాయణ మంచి ఫలితాలనిస్తాయి.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంతాన ఆలోచనల్లో అలజడి వస్తుంది. చిత్త చాంచల్యాన్ని తగ్గించుకోవాలి. సృజనాత్మకతను కోల్పోతారు. కళాకారులకు అనుకూల సమయం. వంశపరంపరమైన ఆలోచనలు పెరుగుతాయి. శివారాధన, గణపతి ఆరాధన, దుర్గాస్తోత్రపారాయణ మంచి ఫలితాలనిస్తాయి.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సౌకర్యాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలపై ఆసక్తి ఉంటుంది. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. ఆహారంలో సమయ పాలన అవసరం. విద్యార్థులకు కష్టకాలం ఉంటుంది. బంధువులతో ఒత్తిడి. అనారోగ్య సమస్యలు ఉంటాయి.శివారాధన, గణపతి ఆరాధన, దుర్గాస్తోత్రపారాయణ మంచి ఫలితాలనిస్తాయి.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : మాతృవర్గీయుల సహకారం లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. కమ్యూనికేషన్స్ అనుకూలిస్తాయి. ప్రచార, ప్రసార సాధనాల్లో సంతోషం లభిస్తుంది. ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. శివారాధన, గణపతి ఆరాధన, దుర్గాస్తోత్రపారాయణ మంచి ఫలితాలనిస్తాయి.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వాక్‌చాతుర్యం పెరుగుతుంది. వాగ్దానాలు నెరవేరుతాయి. స్థిరాస్తులు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. కంటి సంబంధ దోషాలు ఉంటాయి. ఆలోచనల్లో అననుకూలత ఉంటుంది. శివారాధన, గణపతి ఆరాధన, దుర్గాస్తోత్రపారాయణ మంచి ఫలితాలనిస్తాయి.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శారీరక శ్రమ ఉంటుంది. మృష్టాన్న భోజనంపై దృష్టి ఉంటుంది. ఆలోచనల్లో ఉన్నతి ఏర్పడుతుంది. పట్టుదలతో కార్యసాధన ఉంటుంది. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు మార్పు చెందుతాయి. శివారాధన, గణపతి ఆరాధన, దుర్గాస్తోత్రపారాయణ మంచి ఫలితాలనిస్తాయి.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. ఒత్తిడి ఏర్పడుతుంది. పాదాల నొప్పులు ఉంటాయి. నిత్యావసర ఖర్చులకై ప్రయత్నం చేస్తారు. ఇతరులపై ఆధారపడతారు. శారీరక శ్రమ ఉంటుంది. దూర ప్రయాణాలపై ఆసక్తి ఉంటుంది. శివారాధన, గణపతి ఆరాధన, దుర్గాస్తోత్రపారాయణ మంచి ఫలితాలనిస్తాయి.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : శుభకార్యాల్లో పాల్గొటాంరు. అన్ని రకాల ఆదాయాలు లభిస్తాయి. సంతృప్తి ఉంటుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. శరీర సౌఖ్యం ఉంటుంది. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కళాకారులకు అనుకూల సమయం. సమిష్టి ఆదాయం ఉంటుంది. శివారాధన, గణపతి ఆరాధన, దుర్గాస్తోత్రపారాయణ మంచి ఫలితాలనిస్తాయి.
డా.ఎస్ ప్రతిభ