రాజ రాజేశ్వరీ దేవిగా అమ్మవారు

By ramya neerukondaFirst Published Oct 18, 2018, 9:31 AM IST
Highlights

బంగారువర్ణ వస్త్రాలతో అమ్మవారు ధగధగా మెరిసిపోతుంది. ఈ రోజు అమ్మకు నైవేద్యంగా సమర్పించే పదార్థం రవ్వకేసరి.

 

అంబారౌద్రిణి భద్రకటా ళి బగళా జ్వాలాముఖీ వైష్ణవీ

బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్య మానోజ్జ్వలా

చాముండాశ్రిత రక్షపోష జననీ దాక్షాయణీ పల్లవీ

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజ రాజేశ్వరీ!

విజయశమి నాడు దేదీప్య మానంగా వెలిగే, చిద్రూపి అయిన రాజరాజేశ్వరీ రూపంలో అమ్మ మనకు దర్శనమిస్తుంది. ఈ అమ్మను సేవిస్తే వృత్తి ఉద్యోగాల్లో వృద్ధి కలుగుతుంది. నిరుద్యోగులు వారి అర్హతలకు తగిన ఉద్యోగాన్ని పొందుతారు. విజయశమి  నాడు రాజరాజేశ్వరి ఆశ్రిత రక్షపోషజననియై వర్ధిల్లుతుంది.

పురాణాల కథలను బట్టి  , పూజా విధానాలను బట్టి  నవరాత్రులు అందరికీ శక్తిని ఆరాధించేవైనప్పటి కీ, ప్రత్యేకంగా విజయశమి  క్షత్రియుల పండుగ అని తెలుస్తుంది. రాజులు యుద్ధాలకు వెళ్ళే కటా లంలో చేసుకునే ఉత్సవంగా ప్రారంభమైన ఈ పండుగ కటా లక్రమంలో ఆయా వృత్తుల వారు తమ అభ్యుదయాన్ని, జయాన్ని కాంక్షిస్తూ వారి వృత్తికి   సంబంధించిన వస్తువులను పూజించే ఆచారం ఏర్పడింది. ఇప్పటి కీ విజయశమి  'ఆయుధపూజ' విశిష్టంగా కనిపిస్తుంది.

''అత్ర అపరాజితా పూజనం సీమోల్లంఘనం శమీ పూజనం దేశాంతర యాత్రార్థినాం ప్రస్థానప హితం'' అనే ప్రమాణం కూడా పూర్వపు యుద్ధకటా లపు క్షత్రియులకే ఇది ఎక్కువ ఆచారంలో ఉన్నట్లు తొస్తుంది. వర్షాకటా లం పోయి శరద్రుతువు ఆగమనం రాజులకు యుద్ధాలకు అనువైన కటా లం. అందుకే ఆ రోజు అపరాజితను పూజించాలి. అనగా పరాజయం కలుగకుండా దేవిని ఉపాసించాలి. సీమోల్లంఘనం అంటే సరిహద్దులను దాటడం. విజయకటా లంలో బయలుదేరి విజయం సాధింపడానికి   ఆ సమయంలో సీమోల్లంఘనం చెప్పబడింది. ఆ తర్వాత చెప్పబడింది శమీపూజ. అనగా జమ్మిచెట్టును పూజింపడం. ఈ వృక్షానికి   ఆయుర్వేద వైద్యంలో ఉన్న ప్రాధాన్యమధికం. సాయంకటా ల సమయంలో గ్రామ ప్రజలంతా ఊరి చివర, సరిహద్దుల్లోని శమీవృక్ష స్థానానికి   వెళ్ళి అక్కడ పూజించి ఆ పత్రాలను ఒకరికొకరు ఇచ్చుకుంటారు.  పెద్దలకు మిత్రులకు జమ్మి ఆకులను ఇచ్చి -

''శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం

అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనం''

అంటూ ఆశీస్సులు, అభినందనలు పొందుతారు. ఇంతేగాక విజయశమి  రోజున పాలపిట్టను చూడడం జానపదుల ఆచారం. ''పాలపిట్ట దర్శనం కడుపునిండ భోజనం'' అనే మాట జానపదుల నోళ్ళలో తిరుగుతుంది.

సమస్త దేవతలకు, సమస్త మూర్తులకు అధిష్ఠానియై శ్రీపక్రస్థిత అయినటువిం      ఈ రాజరాజేశ్వరి ఉపాసన భవ బంధాలను తొలగింపడమే కటా కుండా, ఇహపర ముక్తిదాయిని. ఈ లోకంలో అత్యున్నత శ్రేణి పదవులను, భోగాలను అందిస్తూ పరలోక ముక్తిని కలిగించేటటువిం  తత్వం ఈ రూపానిదే. అందుకే ఈమెను చిద్రూపి పరదేవతగా కొలుస్తారు. అన్ని రకటా ల విజయాలకు మూలమైన ఈ తత్వ ఉపాసన అందరికీ అవసరమే. ఆ తల్లిని ఆరాదిద్దాం, సేవిద్దాం, ఆనందిద్దాం.

బంగారువర్ణ వస్త్రాలతో అమ్మవారు ధగధగా మెరిసిపోతుంది. ఈ రోజు అమ్మకు నైవేద్యంగా సమర్పించే పదార్థం రవ్వకేసరి.

డా.ఎస్. ప్రతిభ

click me!