today astrology: 18 జులై 2020 శనివారం రాశిఫలాలు

By telugu news team  |  First Published Jul 18, 2020, 7:14 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి నూతన కార్యక్రమాలను సానుకూలపరచుకోవడానికి అధికారులతో సమావేశమవుతారు.


డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Latest Videos

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :-  ఈ రోజు ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. సుదూర ప్రాంత వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. తరచుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నవంటి విషయాల నుంచి బయటపడగలుగుతారు. శుభకార్య ప్రసంగాలను సాగిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు శుభ ఫలితాలు అందుకుంటారు. సౌభాగ్య సిద్ధి ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. అయినప్పటికీ సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు. ఉన్నతాధికారులకు బహుమతులను కానుకగా ఇస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు  కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రారంభించే పనుల్లో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలను సానుకూలపరచుకోవడానికి అధికారులతో సమావేశమవుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. కుటుంబ పరమైన సమస్యలు వృత్తి మీద ప్రభావం చూపించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. సమయాన్ని మాత్రం వృథా చేయరు. నేర్పుగా ఎవ్వరినీ నొప్పించకుండా చాకచక్యంగా వ్యవహరిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. హక్కుల కోసం న్యాయ పోరాటాన్ని సాగిస్తారు. సనాతన సాంప్రదాయ విషయాల మీద ఆసక్తిని కనబరుస్తారు. అనుకోకుండా అనుకూలమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి.పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. హక్కుల కోసం న్యాయ పోరాటాన్ని సాగిస్తారు. సనాతన సాంప్రదాయ విషయాల మీద ఆసక్తిని కనబరుస్తారు. అనుకోకుండా అనుకూలమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. దృఢమైన మనస్సుతో ముందుకు సాగితే మంచిది. ప్రయత్నాలు ఫలిస్తాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు శత్రువులను గుర్తించి వారిని జయించడానికి గాను తగిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటారు. ఇంటి వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో అప్రమత్తత అవసరం. వీలైనంతవరకు కోపతాపాలకు దూరంగా ఉండండి. విలువైన సమాచారాన్ని సకాలంలో అందుకుంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా మీ స్థాయి యథాతధంగా ఉంటుంది. ఓ సంఘటన మీ మానసిక శక్తిని పెంచుతుంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. స్పెక్యూలేషన్ వైపు మొగ్గు చూపుతారు. అయితే చాలా మెలకువ అవసరం. సంతాన విద్యా అవసరాలపైన దృష్టి సారిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు గతంలో చేసిన ప్రయత్నాలకు గాను నేడు అనుకూల ఫలితాలు లభిస్తాయి. ముఖ్యమైన పనుల్లో ఆలస్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. విదేశీ విద్యా, ఉద్యోగ వ్యవహరాలు సానుకూల పడతాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారస్థులకు అనుకూలం.  అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యమని మరువద్దు. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. స్తంభించిన కార్యక్రమాల్లో కదలిక ఏర్పడుతుంది. స్నేహితులు బంధువుల విషయాలను కూడా మీవిగా భావించి తగిన సహాయాన్ని అందిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు అధికారులతో వినమ్రతతో ప్రవర్తించాల్సి ఉంటుంది. చంచల స్వభావం ఇబ్బంది పెడుతుంది. కుటుంబ విషయంలో గోప్యత అవసరం. స్థిరంగా ఆలోచించి మాట్లాడటం, సమాధానం చెప్పడం వల్ల చాలా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. వాహనాలకు రిపేర్స్ తప్పక పోవచ్చు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలను పూర్తి చేయగలుగుతారు. లావాదేవీలు ఆర్థిక పథకముల నిధుల వినియోగం లాభిస్తాయి. రాహుకవచం పారాయణం చేయండి. వ్యవసాయరంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. పెద్దగా ఉపయోగం లేని ప్రయాణాలు చేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 


 

click me!