ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి వాగ్దానాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. మధ్యవర్తిత్వాలు అనుకూలించవు. కుటుంబ సంబంధాల విషయంలో తొందరపాటు పనికిరాదు. పెట్టుబడుల ఆలోచన ఉంటే మానుకోవాలి. ఆర్థిక నిల్వలు తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. తక్కువ మ్లాడి ఎక్కువ పనులు పూర్తి చేసుకోవాలి. శ్రీమాత్రేనమః జపంమంచిది.
డా. ఎస్. ప్రతిభ
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : కమ్యూనికేషన్స్ వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. శ్రీ రాజమాతంగ్యై నమః జపం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : వాగ్దానాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. మధ్యవర్తిత్వాలు అనుకూలించవు. కుటుంబ సంబంధాల విషయంలో తొందరపాటు పనికిరాదు. పెట్టుబడుల ఆలోచన ఉంటే మానుకోవాలి. ఆర్థిక నిల్వలు తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. తక్కువ మ్లాడి ఎక్కువ పనులు పూర్తి చేసుకోవాలి. శ్రీమాత్రేనమః జపంమంచిది.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : ఉద్యోగస్తులకు బదిలీలు సూచిస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమకు తగిన గుర్తింపు లభించదు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శ్రీ రాజమాతంగ్యైనమః జపం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : విశ్రాంతికై ఒత్తిడి అధికంగా ఉంటుంది. విశ్రాంతికోసం ఆరాట పడతారు. అనవసర ఖర్చులు ఉంటా యి. అధికారులకోసం, అధికారిక గృహాల కోసం ఖర్చులు. అధికారిక ప్రయాణాలుంటాయి. దూర ప్రయాణాలకోసం ఎదిరిచూపులు ఉంటా యి. ఇతరులపై ఆధారపడతారు. శ్రీ రాజమాతంగ్యై నమః జపం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకూలత కోసం ప్రయత్నిస్తారు. పెట్టుబడులు విస్తరించే సూచనలు ఉన్నాయి. ఆదర్శవంతమైన జీవితంకోసం ఆరాటపడతారు. సమిష్టి ఆశయాలు నెరవేర్చాలనే తపన కలిగి ఉంటా రు. రాజకీయ పార్టీలపై దృష్టి పెడతారు. దురాశ పెరుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపంమంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : అధికారుల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు. సంఘంలో గౌరవం పెంచుకునే ఆలోచన ఏర్పడుతుంది. కీర్తి ప్రతిష్టలపై దృష్టి పెడతారు. అనుకున్న పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో అంత అనుకూలత ఉండకపోవచ్చు. శ్రీ రాజమాతంగ్యై నమః జపం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : శుభకార్యాల్లో పాల్గొనే ఆలోచన తగ్గుతుంది. విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఏర్పడుతుంది. దూరదృష్టి పెరుగుతుంది. పరిశోధకులకు కష్టకాలం. పరిశోధనలపై ఆసక్తి తగ్గుతుంది. పరాక్రమంతో పని చేస్తారు. విద్య నేర్చుకోవడం ద్వారా వచ్చే గౌరవంకోసం ఎదురు చూపులు ఉంటా యి. సంతృప్తి తక్కువ.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : ఊహించని ఇబ్బందులు ఉంటా యి. అధికారులతో ఒత్తిడి ఏర్పడుతుంది. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. ఆకస్మిక నష్టాలు వచ్చే సూచనలు. ఇతరులపై ఆధారపడతారు. ఇతరుల ఆధారపడతారు. ఆదాయం పన్నులు ముందుగా చెల్లించడం మంచిది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. భాగస్వాములతో అప్రమత్తత అవసరం. ఆచి, తూచి వ్యవహరించాలి. నూతన పరిచయాలు పెంచుకోకూడదు. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. పదిమందిలో గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నాలు అధికంగా చేస్తారు. శ్రీ రాజమాతంగ్యై నమః జపం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. శ్రమాధిక్యం ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అనుకున్న స్థాయిలో సంతోషం ఏర్పడదు. శత్రువులపై విజయం సాధిస్తారు. నిరంతరం పోటీల్లోనే కాలం గడుపుతారు. అనారోగ్య సూచనలు వస్తాయి. జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. శ్రీమాత్రేనమః జపం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సంతాన విషయాల్లో ఒత్తిడి అధికంగా ఏర్పడుతుంది. మానసిక చికాకులు ఏర్పడతాయి. సంతానం వల్ల, సంతానంకోసం ఆలోచనలు పెరుగుతాయి. సృజనాత్మకత తగ్గుతుంది. ఆత్మీయులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యార్థుతలకు ఒత్తిడితో కూడిన సమయం. శ్రీమాత్రేనమః జపంమంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సౌకర్యాలు ఒత్తిడికి గురి చేస్తాయి. ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. విద్యార్థులకు కష్టకాలం. ఆశించిన అభివృద్ధి రాకపోవచ్చు. నిరాశ చెందవద్దు. తల్లి తరఫు బంధువుల వైపు ఆలోచనలు పెరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.