today astrology: 17 జులై 2020 శుక్రవారం రాశిఫలాలు

By telugu news team  |  First Published Jul 17, 2020, 7:12 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి మరిన్ని శుభఫలితాల కలుగుతాయి. ప్రత్యామ్నాయం లేని సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తారు. వృత్తి, ఉద్యోగాల పరంగా పురభోవృద్ధి కనబడుతుంది. సంతాన పురోగతి ఉంటుంది. దాన, ధర్మాలు చేస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.


వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

Latest Videos

మేష రాశి (Aries): ఈ రోజు స్వల్ప ధనలాభ సూచన ఉంటుంది. ప్రారంభించిన పనులు, వ్యవహరాల్లో ఆటంకాలు ఎదురైనా ఆధిగమించే ప్రయత్నాలు చేస్తారు. ఇతరుల పేరు మీద చేసే వ్యాపార, వ్యవహారాల్లో మెలకువ అవసరం. ప్రచారంలో ఉన్న వార్తల్లో నిజనిజాలను తెలుసుకోగలుగుతారు. కీర్తి తెచ్చుకునే ప్రయత్నాలను చేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభ రాశి (Taurus): ఈ రోజు లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందడుగు వేయండి. మరిన్ని శుభఫలితాల కలుగుతాయి. ప్రత్యామ్నాయం లేని సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తారు. వృత్తి, ఉద్యోగాల పరంగా పురభోవృద్ధి కనబడుతుంది. సంతాన పురోగతి ఉంటుంది. దాన, ధర్మాలు చేస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

మిధున రాశి (Gemini): ఈ రోజు శ్రమతో కూడిన ఫలితాలు వస్తాయి. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. బంధు మిత్రులను కలుస్తారు. సకాలంలో సొమ్ము చేతికందదు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లులు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార లావాదేవీల్లో సానుకూల ఫలితాలు గోచరిస్తాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటక రాశి (Cancer): ఈ రోజు మీ మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. పెద్దలు రాసిన డాక్యుమెంట్స్ లో మీకు అనుకూలమైన అంశాలు బయటకు వస్తాయి. ఉన్నతాధికారులకు సన్నిహితంగా ఉంటారు. ఆప్తులకు ధన సహాయం చేస్తారు. రాయాబారాలు సాగిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహ రాశి (Leo): ఈ రోజు పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధను కనబరుస్తారు. వృత్తి, ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు సానుకూల పడతాయి. మొండి వైఖరిని విడనాడండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. కుటుంబ సౌఖ్యముంది. వీలైనంతవరకు కలహాలకు దూరంగా ఉండటం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యా రాశి (Virgo): ఈ రోజు ఒక ముఖ్యమైన వ్యవహారంలో కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. మీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు. పెట్టుబడుల విషయంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. నిర్మాణ వ్యవహారంలో నాణ్యతను పరిశీలించుకోవాలి. రెన్యవల్స్ ను సకాలంలో చెల్లిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

తులా రాశి (Libra): ఈ రోజు సామాజిక సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆనందకరమైన కాలాన్ని గడుపుతారు. రాజకీయ నాయకులతో సఖ్యతను పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. అంతరంగీక చర్చలను సాగిస్తారు. విలువైన బహుమతులను అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి.  కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

వృశ్చిక రాశి (Scorpio): ఈ రోజు ఆర్థికాభివృద్ధితో పాటు తోటివారితో అనుకూలత ఉంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. అప్పు చేసి కొన్ని ముఖ్యమైన పెట్టుబడులు పెడతారు. మీ అంచనాల మేరకు మీరు తీసుకునే నిర్ణయాలు అమలు అవుతున్నట్లుగా భావిస్తారు. ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

ధనుస్సు రాశి (Sagittarius): ఈ రోజు మీ శత్రువర్గానికి ఆయుధం లేకుండా చేస్తారు. పోటీ పరీక్షల పట్ల ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తారు. పక్షపాత వైఖరిని అవలంభిస్తారు. చేపట్టే పనిలో శ్రమ, అలసట పెరుగుతుంది. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. వ్యాపారస్థులకు, చేతిపనివారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి.పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

మకర రాశి (Capricorn): ఈ రోజు ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయగలుగుతారు. స్థిరత్వం దిశగా అడుగులను ముందకు వేస్తారు. లోహపు వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. అన్నింటా ముందు జాగ్రత్తలతో వ్యవహరిస్తారు. వినోద కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

కుంభ రాశి (Aquarius): ఈ రోజు కొత్త పెట్టుబడులు పెడతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంది. వ్యాపారా లాభాలు ఉన్నాయి. నూతన గృహ యోగ్యత ఏర్పడే సూచన ఉంది. పెద్దలతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా పరిణమిస్తాయి.పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మీన రాశి (Pisces): ఈ రోజు బంధువులతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. విందు, వినోదాల్లో కాలం గడుపుతారు. ఆర్థిక అంశాల్లో జాగ్రత్త అవసరం. మొండి బకాయిలకు గాను గట్టి హామీ లభిస్తుంది. గతంలో ఆగిపోయిన ముఖ్యమైన వ్యవహారాలను పురోభివృద్ధి గమనంలో నడిపించడానికి నేడు యత్నాలు ముమ్మరం చేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

click me!