04 ఆగస్టు 2018 శనివారం మీ రాశిఫలాలు

 |  First Published Aug 4, 2018, 9:29 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి


మేషం

మేషం : అదృష్టం కలిసివచ్చే రోజు. మీరు చాలాకాలం నుంచి ఎదురు చూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. మీ తోటి వారి నుంచి కానీ, సహోద్యోగుల నుంచి కాని ప్రశంసలు అందుకుంటారు. అనుకోని లాభం కాని, బహుమతి కానీ అందుకుంటారు. మానసికంగా కొంత ఆందోళన ఉన్నప్పటికీ, కుటుంబసభ్యుల కారణంగా దాని నుంచి బయటపడగలుగుతారు.

వృషభం

వృషభం : ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ అవసరం. వారు ముఖ్య ంగా కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. అలాగే పనిఒత్తిడి అధికంగా ఉంటుంది. శివారాధన చేయడం మంచిది..

మిథునం

Latest Videos

మిథునం : ఆహ్లాదకరమైన రోజు. ఇష్టమైన వారితో గడుపుతారు. బంధుమిత్రుల సమాగమం. వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడం అలాగే పాతమిత్రులను కలుసుకుంటారు. ఆర్థికంగా లాభిస్తుంది. ప్రయాణాలు చేసే అవకాశముంది. ఆవేశానికి, అత్యుత్సాహానికి లోనై అనవసర వివాదాల్లో తలదూర్చకండి.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు అనుకున్న పనులు తక్కువ శ్రమతో పూర్తి అవుతాయి. చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న విషయంలో శుభవార్త వింటారు. మీ లక్ష్యం నెరవేరుతుంది. ధనలాభం కలుగుతుంది. అలాగే రుచికరమైన భోజనం చేస్తారు. మీ స్నేహితులను కలుసుకుంటారు.

సింహం

సింహం : ఈ రోజు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు వచ్చే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా మానసిక ప్రశాంతత ఉండదు. అలసట, నీరసం అధికంగా ఉంటాయి. మానసికంగా ఏదో కోల్పోయిన భావన ఉంటుంది. ఏ పని కూడా ఉత్సాహంగా చేయలేరు.

కన్య

కన్య : మీ సహోద్యోగులు, పైఅధికారులతో సుహృద్భావంతో మెలగండి. వారితో గొడవలకు దిగడం మంచిది కాదు. అలాగే వారు చెప్పిన దానిని శ్రద్ధగా విని ఆచరించటానికి ప్రయత్నించడం. కోపావేశాలకు లోనవడం వలన అనవసర సమస్యలకు గురయ్యే అవకాశముంటుంది.

తుల

తుల : ఈ రోజు మీ జీవిత భాగస్వామితో, పిల్లలతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి వినోదయాత్ర చేసే అవకాశముంది. ఆర్థికంగా సామాన్యదినం. ఖర్చు అధికంగా ఉంటుంది. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. నూతన ఒప్పందాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.

వృశ్చికం

వృశ్చికం : ఆర్థికంగా కొంత ఇబ్బందిని కలిగించే రోజు. ధన నష్టం కానీ, అనవసరమైన ఖర్చు కానీ ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. ఎవరికి కూడా డబ్బు విషయంలో మాట ఇచ్చి ఇబ్బంది పడకండి. ఆర్థిక నియంత్రణ అవసరం.

ధనుస్సు

ధనుస్సు : ఆర్థికంగా కొంత ఇబ్బందిని కలిగించే రోజు. ధన నష్టం కానీ, అనవసరమైన ఖర్చు కానీ ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. ఎవరికి కూడా డబ్బు విషయంలో మాట ఇచ్చి ఇబ్బంది పడకండి. ఆర్థిక నియంత్రణ చాలా అవసరం.

మకరం

మకరం : ఆరోగ్యం విషయంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి కానీ, ఛాతిలో మంటతో కానీ బాధపడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయకండి. అలాగే మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది.

కుంభం

కుంభం : ఈ రోజు ఆర్థికంగా కలిసి వస్తుంది. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. అలాగే మొండి బకాయిలు వసూలవుతాయి. భూ సంబంధ లావాదేవీలు చేస్తారు. కుటుంబసభ్యుల సహాయ, సహకారాలు అందుతాయి.

మీనం

మీనం : ఈ రోజు పనుల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఆటంకాలు వచ్చినా ప్రయత్నం మానకండి. కొద్దిశ్రమతో ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. ఆఫీస్‌లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఓపికతో మెలగాల్సిన సమయం. మానసికంగా ఓటమిని ఒప్పుకోకండి, విజయం మీ వశమవుతుంది.

click me!