03 ఆగస్టు 2018 శుక్రవారం మీ రాశిఫలాలు

 |  First Published Aug 3, 2018, 9:41 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.


మేషం

ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.ముఖ్యంగా కంటి కి సంబంధించిన సమస్యలతో బాధపడే అవకాశముంటుంది. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. అలాగే పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. చేపట్టిన పనులు అనుకోకుండా చివరి నిమిషంలో వాయిదా పడడం వలన చికాకుకు, ఆందోళనకు గురి అవుతారు.

వృషభం

ఆహ్లాదకరమైన రోజు. ఇష్టమైనా వారితో గడుపుతారు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడం అలాగే పాతమిత్రులను కలవడం జరుగుతుంది. సమయానికి డబ్బు అందడం వల్ల ఆర్థిక సంబంధ సమస్య తొలగిపోతుంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్థలు తొలిగిపోతాయి. స్నేహితుల ద్వారా అనుకోని సాయం అందుతుంది.శివారాధన చేయడం మంచిది.

మిథునం

Latest Videos

undefined

ఈ రోజు అనుకున్న పనులు తక్కువ శ్రమతో పూర్తి అవుతాయి. చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న విషయంలో శుభవార్త వింటారు. మీ లక్ష్యం నెరవేరుతుంది. ధనలాభం కలుగుతుంది.అలాగే రుచికరమైన భోజనం చేస్తారు. మీ స్నేహితులను కలుసుకుంటారు.

కర్కాటకం

ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు వచ్చే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా మానసిక ప్రశాంతత ఉండదు. అలసట, నీరసం అధికంగా ఉంటాయి.. మీ సంతానం గురించి కానీ, ఏదైనా పోటీ విషయంగా కాని డబ్బు ఖర్చవుతుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి.

సింహం

ఈ రోజు మీ పై అధికారులతో కానీ, సహోద్యోగులతో కానీ, స్నేహ పూర్వకంగా మెలగడం మంచిది. అనుకోని వివాదాలు జరిగే అవకాశముంటుంది కాబట్టి కోపానికి, ఆవేశానికి తావివ్వకండి. వాద వివాదాలకు దూరంగా ఉండండి. శివారాధన మేలు చేస్తుంది. ఇతరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం.

కన్య

ఈ రోజు మీ జీవిత భాగస్వామితో, పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారితో కలిసి వినోదయాత్ర చేసే అవకాశముంది. విలాసాల కోసం ఖర్చు అధికంగా చేస్తారు. పెట్టుబడులకు, నూతన ఒప్పందాలకు అనువైన రోజు కాదు. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు.

తుల

మీరు అనుకున్న పనులు పూర్తి చేయటానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. అలాగే చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు. ప్రయాణాలు, నూతన వ్యాపార సంబంధ లేదా గృహ సంబంధ ఒప్పందాలు పూర్తి చేస్తారు.

వృశ్చికం

ఆర్థికంగా కొంత ఇబ్బందిని కలిగించే రోజు. ధన నష్టం కానీ, అనవసరమైన ఖర్చు కానీ ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. ఎవరికి కూడా డబ్బువిషయంలో మాట ఇచ్చి ఇబ్బంది పడకండి. ఆర్థిక నియంత్రణ అవసరం. ఆరోగ్యం కుదుట పడుతుంది. గృహ సంబంధ వ్యవహారాలలో బిజీగా గడుపుతారు. అనుకున్న పనులు పూర్తవుతాయి.

ధనుస్సు

ఆరోగ్య విషయంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి కానీ, ఛాతిలో మంటతో కానీ బాధ పడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయకండి. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది.

మకరం

ఆర్థికంగా కలిసి వస్తుంది. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. భూ సంబంధ లావాదేవీలు చేస్తారు. కుటుంబసభ్యుల సహాయ, సహకారాలు అందుతాయి.గృహసంబంధ వ్యవహారాలపై డబ్బు ఖర్చు చేస్తారు. శ్రమతో శారీరక అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది.

కుంభం

ఈ రోజు చేసే పనిలో అడ్డంకులు ఎక్కువగా ఎదుర్కొంటారు. అలాగే తలపెట్టిన ప్రయాణాలు వాయిదా పడతాయి. అయితే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు కాబట్టి అడ్డంకులు ఏర్పడినప్పటికి నిరాశకు లోనవకుండా పని పూర్తి చేయటానికి ప్రయత్నిస్తారు. మీ స్నేహితుల సహాయం అందుకుంటారు.

మీనం

ఈ రోజు అదృష్టం కలిసివచ్చే రోజు. మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. తక్కువ శ్రమతో అనుకున్నది సాధిస్తారు. మీ తోటి వారి నుంచి కానీ, సహోద్యోగుల నుంచి కాని ప్రశంసలు అందుకుంటారు. మీ జీవిత భాగస్వామి ద్వారా అనుకోని సాయం అందుకుంటారు.

click me!