
ఇలా ఆధ్యాత్మికంగా భావించే మొక్కలలో తులసి మొక్క ఒకటి తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి ప్రతి ఒక్కరి ఇంటి ఆవరణంలో ఈ మొక్కను నాటి పూజిస్తూ ఉంటారు. అయితే తులసి మొక్కతో పాటు ఈ రెండు రకాల మొక్కలను కూడా ఇంటి ఆవరణంలో పెంచడం వల్ల లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి. మరి ఆ రెండు మొక్కలు ఏంటి అనే విషయానికి వస్తే..
మన ఇంటి ఆవరణంలో తులసి మొక్కతో పాటు శమీ వృక్షం, నల్ల దతుర మొక్కలను ఇంటి ఆవరణంలో పెంచడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భావిస్తారు. పురాణాల ప్రకారం నల్లధతురా మొక్కలలో పరమేశ్వరుడు కొలవై ఉంటారని చెబుతారు. ఇలా శమీ వృక్షంలో బ్రహ్మ విష్ణువులు కొలువై ఉంటారు. తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు.
ఈ విధంగా తులసి మొక్కతో పాటు నల్ల ధతురా, శమీ వృక్షాన్ని కూడా పూజించటం వల్ల బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉండి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా అలాగే మన ఇంటిపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉండకుండా కాపాడుతాయి. అలాగే ఉద్యోగం వ్యాపారాలలో పురోగతి సాధించాలి అంటే ఈ మొక్కలను పూజించడం ఎంతో మంచిది. ఈ మొక్కలను పూజించడం వల్ల పితృ దోషాలు కూడా తొలగిపోతాయి.