
శనీశ్వరుడి దృష్టిలో తన మన అనే బేధం ఉండదు. తప్పు చేసిన ఎవరికైనా తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు. ఇలా ఒక్కసారి శని ప్రభావం మనపై కనుక పడింది అంటే ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో జరగవు ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఇతరుల నుంచి అవమానాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే శని ప్రభావం మనపై ఉండకూడదు అంటే మనం చేసే పనులను ఎప్పుడు దృష్టిలో ఉంచుకొని మన వల్ల ఇతరులు ఇబ్బంది పడకుండా ఇతరులకు అన్యాయం చేయకుండా ఉండేలా చూసుకోవాలి.
ఇక శని ప్రభావం నుంచి బయటపడటానికి చాలామంది ఎన్నో రకాల పరిహారం మార్గాలను అనుసరిస్తూ ఉంటారు. ఇలా శని ప్రభావం నుంచి బయటపడాలంటే హనుమంతుడిని, ఈశ్వరుడిని పూజించడం వల్ల శని బాధలు తొలగిపోతాయని భావిస్తారు.ఇక ఈ శని ప్రభావం నుంచి బయటపడాలి అంటే చాలామంది శనీశ్వరుడికి ఎంతో ఇష్టమైన నీలిరంగు రత్నాలను ధరించడం మనం చూస్తుంటాము. ఇలా నీళ్లు రంగురత్నం ధరించడం వల్ల శని ప్రభావం నుంచి బయటపడవచ్చు. ఇలా నీలిరంగు రత్నం కాస్త ఖరీదైనది అయినప్పటికీ ఈ రత్నం ధరించడం వల్ల శని ప్రభావం తొలగిపోతుంది అయితే ఈ రత్నం ధరించేటప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కొన్ని రకాల నియమ నిబంధనలు పాటించాలి అప్పుడే ఈ రత్నం ప్రభావం మనపై ఉంటుంది.
ఈ రత్నం ధరించినవారు సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొనడం వంటివి చేస్తూ ఉండాలి. ఈ రత్నం కనుక సెట్ అయితే ఈ రత్నం ధరించిన వ్యక్తి జీవితంలో ఎదగదలను ఆపడం ఎవరి తరం కాదు అలా కాకుండా ఈ రత్నం సెట్ అవ్వలేదు అంటే అలాంటి వారి జీవితం పాతాళానికి పడిపోతుంది.అందుకే ఈ రత్నం ధరించిన వారు నియమాలు పాటించడం మంచిది. ఈ రత్నం ధరించిన వారు ఎదుటి వారికి ఎప్పుడు సాయపడుతూ ఉండాలి. ఇక నీలి రంగు పుష్పాలతో శివుడి హనుమంతుడిని అయ్యప్పని కూడా పూజించడం ఎంతో మంచిది. ఈ రత్నం ధరించేవారు శనివార నియమాల్ని పాటించడం వల్ల కూడా శనీశ్వరుడు అనుగ్రహం మనపై కురిపిస్తాడు.