ఈ రాశి అబ్బాయిలు ఆ విషయంలో బంగారాలు..!

Published : Mar 04, 2023, 10:00 AM IST
ఈ రాశి అబ్బాయిలు ఆ విషయంలో బంగారాలు..!

సారాంశం

ఈ కింది రాశుల అబ్బాయిలు మాత్రం.. ఆ విషయంలో బంగారాలు. జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింది రాశులకు చెందిన పురుషులు చాలా నమ్మకంగా, నిజాయితీగా ఉంటారట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...

ఎలాంటి రిలేషన్ నిలపడాలన్నా... వారి మధ్య నమ్మకం చాలా ముఖ్యం. నమ్మకం అనేది బంధానికి పునాది లాంటిది. కేవలం ఆ నమ్మకం లేకపోవడం వల్ల.... చాలా బంధాలు ముగిసిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే.... ఈ కింది రాశుల అబ్బాయిలు మాత్రం.. ఆ విషయంలో బంగారాలు. జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింది రాశులకు చెందిన పురుషులు చాలా నమ్మకంగా, నిజాయితీగా ఉంటారట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...


1.వృషభం

వృషభ రాశి వారు అన్నిటికంటే నిజాయితీకి  ఎక్కువ విలువ ఇస్తారు. వారు సంబంధాలలో అగౌరవాన్ని సహించలేరు. ముఖ్యంగా.. వారి భాగస్వామి వారికి నమ్మక ద్రోహం చేస్తే అస్సలు జీర్ణించుకోలేరు. వృషభరాశులు తమ జీవితంలోని అన్ని ఇతర అంశాల కంటే విధేయతకు, నమ్మకానికి ఎక్కువ  ప్రాధాన్యత ఇస్తారు.


2.కర్కాటక రాశి...

కర్కాటక రాశి పురుషులు తమ ప్రాధాన్యతల గురించి చాలా స్పష్టంగా ఉంటారు. వారు ఎవరినైనా ప్రేమిస్తే.. వారి కోసం ఏదైనా చేస్తారు.  వారు సంబంధాలలో నిజాయితీ,  విధేయతకు ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి మోసం చేసే భాగస్వామితో ఉండడం ఎలా ఉంటుందో కూడా వారు ఊహించలేరు. వీరు ఎవరినీ మోసం చేయరు. ఎవరైనా మోసం చేసినా  అంగీకరించలేరు.

3.సింహ రాశి...
సింహరాశి పురుషులు చాలా నమ్మకస్తులు.  వారి భాగస్వాములకు విధేయులుగా ఉంటారు. వారు తమ భాగస్వాములకు ఎక్కువ విలువ ఇస్తారు. వారికి నమ్మకద్రోహం చేయడాన్ని ఇష్టపడరు. వారి భాగస్వామి వారిని అత్యంత బాధాకరమైన రీతిలో బాధపెట్టినప్పటికీ వారు చలించరు. అయినప్పటికీ తమ పార్ట్ నర్ పట్ల ప్రేమగానే ఉంటారు.


4.ధనస్సు రాశి...
ఈ రాశికి  చెందిన  పురుషులు వారి సంబంధాలపై చాలా ఎక్కువ దృష్టి పెడతారు. ఈ రాశి వారు తమ భాగస్వామి భావాల పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. తమ భాగస్వామికి ఎలా ఉంటే నచ్చుతుందో అలానే ఉంటారు. పొరపాటున కూడా మోసం చేయాలనే ఆలోచన వీరికి రాదు. చాలా నమ్మకంగా ఉంటారు.  వారు ఒక సంబంధంలో వారి ఇమేజ్ గురించి చాలా స్పృహ కలిగి ఉంటారు.


5.మకర రాశి...

మకర రాశి పురుషులు చాలా విధేయులు, నిజాయితీపరులు. వారు సంబంధంలో స్పష్టమైన ప్రాధాన్యతలను కలిగి ఉంటారు. వారు తమ భాగస్వామితో చాలా సూటిగా ఉంటారు. అంతే నమ్మకంగా కూడా ఉంటారు. వారు తమ భాగస్వామి నుంచి ఏం ఆశిస్తున్నారో అనే విషయంలోనూ చాలా క్లారిటీగా ఉంటారు. 


ఈ కింది రాశులకు చెందిన పురుషులను మాత్రం ఆ విషయంలో పెద్దగా నమ్మలేం.
మేషం, మిధునం, కన్య, తుల, వృశ్చికం, కుంభం, మీనం రాశుల వారు విధేయత విషయానికి వస్తే వారి మనసును మళ్లించినట్లు కనిపిస్తుంది. వారు తమ భాగస్వామికి 100% విధేయులని హామీ ఇవ్వలేం.

PREV
click me!

Recommended Stories

Taurus Horoscope 2026: వృషభ రాశివారికి శని ఆశీస్సులు 2026లో డబ్బుకు లోటే ఉండదు..!
Vrushabha Rashi Phalalu: 2026వ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది?