పెళ్లైన మహిళలు ఏ రోజున తలస్నానం చేయాలి..?

By telugu news team  |  First Published Apr 14, 2023, 3:00 PM IST

హిందూ మతంలో ఇంట్లోని స్త్రీలను ఇంటి లక్ష్మిగా పరిగణిస్తారు. ఇంటి ఆనందం, శ్రేయస్సు లక్ష్మికి అంటే ఇంటి మహిళకు సంబంధించినది.


హిందూ మత గ్రంథాలలో, పూజ పాఠాలు మాత్రమే కాకుండా, దాదాపు అన్ని పనులకు అవసరమైన నియమాలు కూడా పేర్కొన్ానరు. ఈ నియమాలు పాటిస్తేనే ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని చెబుతారు. హిందూ మతంలో ఇంట్లోని స్త్రీలను ఇంటి లక్ష్మిగా పరిగణిస్తారు. ఇంటి ఆనందం, శ్రేయస్సు లక్ష్మికి అంటే ఇంటి మహిళకు సంబంధించినది.

కాబట్టి, శాస్త్రంలో పేర్కొన్న ఈ నియమాలను ఇంట్లోని మహిళలు పాటించడం చాలా ముఖ్యం. ఒక స్త్రీ అశుభ కార్యాలు చేసినా లేదా నియమాలను పాటించకపోయినా, అది కుటుంబం, గృహ సంతోషం, శ్రేయస్సు, ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఈ నియమాలలో ఒకటి తలస్నానం చేయడం.

Latest Videos

undefined

పెళ్లైన మహిళల తలస్నానం చేయాల్సిన వారం ఇది...

గ్రంథాలలో, స్త్రీలు తలస్నానం చేయడం  శుభ , అశుభ దినాలకు సంబంధించిన నియమాలు ప్రస్తావించారు.. మీకు తెలుసా పెళ్ళైన స్త్రీకి , అవివాహిత అమ్మాయికి తలస్నానం చేసే విధానంలో కూడా తేడా ఉంటుంది.

పెళ్లికాని అమ్మాయిలు బుధవారం తలస్నానం చేయూకడదు. ఇలా చేయడం వల్ల సోదరుడికి ఇబ్బంది కలగవచ్చు.
ముఖ్యంగా తమ్ముళ్లు ఉన్నవారు బుధవారాల్లో తలస్నానం అస్సలు చేయకూడదు.
సాధారణంగా మహిళలు ఏదైనా ప్రత్యేక పండుగ, శుభ సందర్భంలో తలస్నానం చేస్తారు. కానీ శాస్త్రాల ప్రకారం, మహిళలు తమ జుట్టును శుభ దినం లేదా శుభ సమయంలో కడగకూడదు. మీరు మీ జుట్టును కడగవలసి వస్తే, పవిత్రమైన తేదీల ముందు రోజు ఆ పని చేయాలి.

శాస్త్రాల ప్రకారం, స్త్రీలు అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి లేదా ఉపవాస రోజులలో కూడా తల స్నానం చేయకూడదు. ఈ రోజుల్లో మీరు కొన్ని కారణాల వల్ల తల స్నానం చేయాల్సి  వస్తే, ముందుగా మీ జుట్టుకు పచ్చి పాలను పట్టించి, ఆపై మీ జుట్టును కడగాలి.


 
వివాహితులు గురువారం పొరపాటున కూడా జుట్టు కడగకూడదు. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితిపై చెడు ప్రభావం పడుతుంది.
షేవింగ్ , జుట్టు కడగడానికి శుక్రవారం చాలా పవిత్రమైనదిగా పరిగిస్తారు. అందుకే స్త్రీలు, ముఖ్యంగా కొడుకుల తల్లులు అయిన స్త్రీలు శుక్రవారాల్లో జుట్టు కడగడం శుభప్రదంగా భావిస్తారు.
శుక్రవారాల్లో జుట్టు కడుక్కోవడం వల్ల లక్ష్మి మాత ప్రసన్నం అవుతుంది. ఎందుకంటే ఈ రోజు లక్ష్మీ దేవి రోజు.
జుట్టు కడగడానికి శనివారం మంచిది కాదు.  అలాగే శనివారం రోజు జుట్టుకు నూనె రాసుకోకండి.

click me!