తీరొక్కపూల బతకమ్మ

By ramya neerukondaFirst Published Oct 9, 2018, 2:30 PM IST
Highlights

తెలంగాణ ప్రాంతంలో విశిష్టమైన పండుగ బతుకమ్మ. ఇది కూడా నవరాత్రుల ప్రకృతి శక్తికి సంకేతమే. నవరాత్రులకన్నా ఒకరోజు ముందుగానే భాద్రపద బహుళ అమావాస్య నుండి (పితృ అమావాస్య -పెత్రమాస) ప్రారంభమై 9 రోజుల పాటు కొనసాగి సద్దుల బతుకమ్మ దుర్గాష్టమితో  (ఆహార సంపదలతో కూడిన తల్లి) పూర్తి అవుతుంది.

యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా

నమస్తస్యై నమస్త్యస్యై నమస్తస్యై నమోనమః

అంటూ అమ్మవారిని శక్తి స్వరూపంగా ఆరాధిస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం శరదృతువులో వచ్చే ఆశ్వీజ మాసంలోని మొది తొమ్మిది రోజులను నవరాత్రులుగా భావన చేసి పూజించడం భారతీయమైన సంప్రదాయం. శక్తి స్వరూపాన్ని నిరంతరం మనం గౌరవిస్తూ ఉండడం ఆషాఢ మాసం నుండి మొదలవుతూ ఉంటుంది.  ప్రతి సంవత్సరం వర్షఋతువు ప్రారంభం సమయంలో ప్రకృతిలో మనకు మార్పులు కనిపిస్తూ ఉంటాయి. అటువిం సమయంలో భౌతిక, మానసిక శరీరాలకు ఇబ్బందులు ఏర్పడకుండా, మనచుట్టూ ఉండే ప్రకృతిని మనం కాపాడుకుంటూ, దానికి అనుగుణంగా వర్తిస్తూ ఉండడమే అమ్మవారికి చేసే అర్చన.

వర్షాకాలంలో మన పరిసరాల్లో నిలిచే జలం అధికం కావడం, సూర్యోదయాలు తక్కువగా ఉండి ఆకాశం మేఘావృతంగా ఉండడం వల్ల సరిగ్గా ఆరీ ఆరని భూమి ఉంటుంది. అందువల్ల సూక్ష్మజీవులు బాగా ప్రభావితం చేసి నీటి   కాలుష్యానికి గురి చేస్తుటాంయి.  ఆ నీటి  ని శుభ్రం చేయకుండా తీసుకోవడం, ఆ పరిసరాల్లో ఉండడం వల్ల శరీరం రోగమయమవుతుంది. బాగా వర్షాలు కురుస్తున్న సమయంలో బయట పనులేమీ లేక మనస్సు కూడా పరిపరి విధాలుగా పోవడం వల్ల మానసికంగా స్థిమితంగా ఉండడం అవసరం అవుతుంటుంది.

అటువిం సందర్భంలోనూ వ్యక్తి తనని తాను నియంత్రించుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. తనని తాను శుభ్రం చేసుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. ఇంకా ఇటువిం సమయాల్లోనే పొలం పనులు చేసుకోవలసిన అవసరం ఉండడం వల్ల తమను, తమ పరిసరాలను లోకం గమనించకుండా పోతుంది. ప్రకృతిలో వచ్చే ఈ అసంతులితమైన శక్తి ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ ఇబ్బందులనుండి తమను రక్షించమంటూ మనశ్శరీరాలను శుద్ధిచేసుకునే ప్రక్రియ ఈ శక్తికి సంబంధించిన ఆరాధన.

ఈ ఆరాధనలో భాగంగానే తెలంగాణ ప్రాంతంలో విశిష్టమైన పండుగ బతుకమ్మ. ఇది కూడా నవరాత్రుల ప్రకృతి శక్తికి సంకేతమే. నవరాత్రులకన్నా ఒకరోజు ముందుగానే భాద్రపద బహుళ అమావాస్య నుండి (పితృ అమావాస్య -పెత్రమాస) ప్రారంభమై 9 రోజుల పాటు కొనసాగి సద్దుల బతుకమ్మ దుర్గాష్టమితో  (ఆహార సంపదలతో కూడిన తల్లి) పూర్తి అవుతుంది.

బొడ్డెమ్మను బతుకమ్మను ఈరోజున ప్రారంభించి ఆటలు ఆడతారు. ప్రకృతికి సంబంధించిన పండుగ. దీనిని ఎంగిలి పూవు బతుకమ్మ అంటారు. ఎంగిలి పూవునాడు అమ్మవారును అవాహన చేయడం, 9వరోజున అమ్మవారును సాగనంపడం ఉంటుంది. వినాయక చవితికి ఆకులతో ప్రారంభమైన పూజ బతుకమ్మకు ప్రకృతిలో వచ్చే రంగు రంగుల పూలతో పూజ చేయడం ధర్మంగా వస్తూంది. ప్రకృతి నుండి వెలువడే ఎన్నో తేలికైన పూలను పేర్చి వాటి  పైన గౌరీదేవిని ప్రతిష్ఠించి, సాయంకాలం సమయంలో వాని చుట్టూ తిరుగుతూ, ఆడుతూ, పాడుతూ ఆనందాన్ని పొందే పండుగ ఇది. ప్రకృతిలో వచ్చే శక్తికి సంకేతం ఈ పండుగ. ప్రకృతిని ఆరాధించడమే ఇందులో ఉంటుంది. నియమ నిష్ఠలు కూడా దీనిలో అధికమే.

వైజ్ఞానికంగా ఒక అరోమా థెరపీ కూడా ఈ పండుగలో కనిపిస్తుంది. ఆయుర్వేద గుణాలున్న పుష్పాల చుట్టూ తిరుగుతూ చేసుకునే ఈ పండుగ, ఈ దక్షిణాయన, శరత్కాలాలలో సూక్ష్మజీవులు, దోమల ద్వారా వ్యాపించే వేరు వేరు రోగాల నుండి తట్టుకునేశక్తిని, ఆనందాన్ని పంచుకునే శక్తిని పెంచుతుంది.

click me!