నూతన సంవత్సరంలో సింహరాశి వారి రాశిఫలాలు

By ramya neerukondaFirst Published Dec 31, 2018, 12:38 PM IST
Highlights

నూతన సంవత్సరంలో సింహరాశివారికి ఎలా ఉందంటే...

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : వీరికి పంచమ అష్టమాధిపతి గురుడు చతుర్థంలో,  షష్ఠ సప్తమాధిపతి శని  పంచమంలో, వ్యయంలో రాహువు, షష్ఠంలో కేతువు ఉన్నారు. మార్చ్‌ తర్వాత లాభంలో రాహువు, పంచమంలో కేతువు ఉంటారు.

వీరికి కడుపుకు సంబంధించిన అనారోగ్యాలు వచ్చే సూచనలు ఉన్నాయి. జాగ్రత్త వహించాలి. అధిక శ్రమతో సౌకర్యాలను సమకూర్చుకుటాంరు. ఇల్లు చాలా విశాలంగా ఉండాలని కోరుకుటాంరు. కాని ఆ ఇల్లువీరికి ఉపయోగపడదు. ఇల్లు కూడా అధిక వ్యయ ప్రయాసలకు ఓర్చి సంపాదించుకుటాంరు. తక్కువ శ్రమతో వచ్చే ఫలితానికి సంతోషం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. ఊహించని ఇబ్బందులు, ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. ఏ ఫలితాన్ని కూడా ఆశించ కుండా ఉండాలి. ఆశించిన ఫలితం రాదు. సంతృప్తి తక్కువగా ఉంటుంది.

వీరికి సంతాన సమస్యలు ఉంటాయి. సృజనాత్మకతను కోల్పోతారు. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులు అధిక శ్రమతో తక్కువ ఫలితాలు సాధిస్తారు. చదువుపైన శ్రద్ధ తక్కువగా ఉంటుంది. పరిపాలన సమర్ధతను కోల్పోతారు. ఆత్మీయత, అనురాగాలు కోల్పోతారు. కళాకారులకు కొంత ఒత్తిడితో ఉన్న సమయం. హృదయ సంబంధ ఆనందం తక్కువగా ఉంటుంది. ఆలోచనల్లో చంచలత్వం ఏర్పడుతుంది.

విశ్రాంతికోసం ప్రయత్నిస్తారు. అనవసర ప్రయాణాలు అనవసర ఖర్చులు చేస్తారు. సమయం, కాలం, ధనం వృథా అవుతాయి. సుఖంకోసం ఆరాటపడతారు. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. పాదాల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. విహార యాత్రలు చేసే ఆలోచన ఉంటుంది. మార్చి తర్వాత నుంచి చేసే పనుల్లో లాభాలు వస్తాయి. సంపాదన పై దృష్టి ఉంటుంది. దురాశ కొంచెం పెరుగుతుంది. పక్కవారితో సరిపోల్చుకునే ప్రయత్నం చేస్తారు. ఆ విషయాలు పనికిరావు. జాగ్రత్తగా ఎవరికి వారే ఉండాలి.

వీరికి మార్చి వరకు కొంత సౌకర్యవంతమైన జీవితం ఏర్పడుతుంది. చేసే పనుల్లో నిరాశలు ఉంటాయి. ఆశించిన గుర్తింపు రాకపోవచ్చు. శత్రువులపై విజయ సాధనకు ప్రయత్నం చేస్తారు. వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. మార్చి తర్వాత వీరికి సంతాన సమస్యలు అధికం అవుతాయి. వారి గురించి ఆలోచనలు ఉంటాయి. విద్యార్థులకు ఉన్నదానికంటే శ్రమ ఎక్కువౌతుంది.

వీరు ప్రతిరోజూ యోగా, ప్రాణాయామాలు, లేదా వాకింగ్‌ చేయడం తప్పనిసరి. దుర్గా స్తోత్ర పారాయణలు, మినప సున్ని ఉండలు, ఇడ్లీ, వడలు దానం చేయాలి. పశు పక్షాదులకు ఆహారాన్ని ప్టోలి. పసుపు రంగు వస్త్రాలను, నీలిరంగు వస్త్రాలను దానం చేయడం మంచిది.

ఈ రాశివారికి మొత్తంపై అంత అనుకూలత ఉండదు. అన్ని గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోవడం తప్పనిసరి. ఆ పరిహారాల వల్ల వీరు ఉన్న స్థితినుంచి కిందికి పడిపోకుండా ఉండడానికి అవి ఉపయోగపడతాయి.

డా.ఎస్.ప్రతిభ

ఇతర రాశుల వివరాలు ఇక్కడ చదవండి

నూతన సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉందంటే...

నూతన సంవత్సరంలో వృషభరాశి రాశిఫలాలు ఇలా ఉన్నాయి

న్యూ ఇయర్ లో మిథునరాశి వారి రాశిఫలాలు ఇలా ఉన్నాయి

నూతన సంవత్సరంలో కర్కాటక రాశివారి రాశిఫలాలు

click me!