ఈ నూతన సంవత్సరంలో కర్కాటక రాశివారికి ఎలా ఉందంటే...
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : వీరికి షష్ఠ నవమాధిపతి గురుడు పంచమంలో, సప్తమ అష్టమాధిపతి శని షష్ఠంలో, లగ్నంలో రాహువు, సప్తమంలో కేతువు ఉన్నారు. మార్చ్ తర్వాత వ్యయంలో రాహువు, షష్ఠంలో కేతువు ఉంటారు.
వీరికి సంతానం అనుకూలంగా ఉంటుంది. మాట వింరు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. విద్యార్థులు ఉన్నత విద్యలపై దృష్టి పెడతారు. సృజనాత్మకత పెరుగుతుంది. ఉపాసనను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. దానం కొద్ది బిడ్డలు అనే మాట వీరికి వర్తిస్తుంది. సంతానం పోటీల్లో గెలుపుకోసం ప్రయత్నిస్తారు. ఒకవేళ వాళ్ళు సాధించడంలో కొంత ఇబ్బంది పడినా వారికి సహాయ సహకారాలు అందిస్తారు. చేసే అన్ని పనుల్లోనూ సంతృప్తి లభిస్తుంది. తాము అనుకున్న పనులు పూర్తి చేస్తారు.
undefined
పోటీల్లో గెలుపుకై చాలా శ్రమ పడతారు. శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. పనుల్లో విజయం సాధిస్తారు. కష్టపడడానికి సిద్ధపడతారు. భాగస్వాములతో అనుబంధం పెంచుకునే దిశలో ప్రయత్నం చేస్తారు. ఊహించని ఇబ్బందుల వల్ల కొన్ని పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.
తాము చేసే పనుల్లో తమకే ఒత్తిడి పెరుగుతుంది. అనవసరమైన కాలయాపన ఉంటుంది. చేసే పనుల్లో భయం ఏర్పడుతుంది. పట్టుదలతో కార్యసాధన అవసరం. పనులకు అనుగుణంగా ఆలోచనల్లో మార్పు చేసుకోవాలి. శరీరానికి ప్రాధాన్యత ఇస్తారు. మార్చి తర్వాత వీరికి సమయం, కాలం, ధనం వృథా అవుతాయి. అనవసర ఖర్చులు చేస్తారు. విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. దూర ప్రయాణాలపైదృష్టి ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేస్తారు.
సామాజిక అనుబంధాల్లో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. నూతన పరిచయస్తులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి. పెట్టుబడులు పెట్టకూడదు. మోసపోయే ప్రమాదం ఉంటుంది. అన్ని పనుల్లో వ్యతిరేకత ఉంటుంది. జీవిత వ్యాపార భాగస్వాములతో అనుకోని ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. మార్చి తర్వాత అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. ఊహించని ఇబ్బందులు, ప్రయాణాల్లో ప్రమాదాలకు అవకాశం ఉంటుంది.
సాయిబాబాకు ప్రదక్షిణలు చేయడం, గురువారాలు ఉపవాసాలు ఉండడం, పసుపుపచ్చ వస్త్రం దానం ఇవ్వడం, శివాభిషేకాలు, శివునికి సంబంధించిన ఆలయాల్లో అన్నదానం చేయడం, ఇడ్లీ, వడలు పంచి పెట్టడం చేయాలి. శ్రీరామ జయరామ జయజయరామ రామ జపం మంచిది.
ఈ రాశివారికి ఈ సంవత్సరం మొత్తంపై చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ అనుకూలతను మరింత వృద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలి. పరిహారాలు అంత తీవ్ర స్థాయిలో కాకున్నా కొంత వరకు చేసుకోవడం తప్పనిసరి. ఇప్పుడు చేసుకునే పరిహారాలు ఉన్న స్థితినుంచి ఉన్నత స్థితివైపుకు ఎక్కువ శ్రమలేకుండా వెళ్ళడానికి తోడ్పడతాయి.
డా.ఎస్.ప్రతిభ
ఇతర రాశులవారి వివరాలు ఇక్కడ ఉన్నాయి..
నూతన సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉందంటే...
నూతన సంవత్సరంలో వృషభరాశి రాశిఫలాలు ఇలా ఉన్నాయి
న్యూ ఇయర్ లో మిథునరాశి వారి రాశిఫలాలు ఇలా ఉన్నాయి