
జూన్ 6న ఉదయం 9.29కి బుధుడు మిథునరాశిలోకి ప్రవేశించాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, బుధుడు అతి చిన్న గ్రహం. బుద్ధి, ఐశ్వర్యం, సౌందర్యానికి అధిపతి. జూన్ 22న రాత్రి 9.33కి బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు గోచారాలు మేషరాశి వారికి మంచి ఫలితాలనిస్తాయి.
మేషం
బుధుడి గోచారం మేషరాశి వారికి శుభప్రదం. పెట్టుబడులకు మంచి సమయం. ఆస్తి, వాహన సుఖం కలుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
మిథునం
బుధుడి గోచారం వల్ల మిథునరాశి వారికి లాభాలున్నాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. జూన్ నెల మొత్తం శుభప్రదం. పిత్రార్జిత ఆస్తి లభించే అవకాశం ఉంది.
సింహం
బుధుడి గోచారం సింహరాశి వారికి కెరీర్‌లో, వ్యాపారంలో అభివృద్ధినిస్తుంది. శుభవార్తలు వింటారు. మంచి రోజులు.
జూన్ 7న మధ్యాహ్నం 2.10కి మంగళుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల సింహరాశిలో మంగళ, కేతువుల కలయిక ఏర్పడుతుంది. 51 రోజులు కొన్ని రాశులకు కష్టకాలం. మేషం, వృషభం, సింహం, కన్య, మీన రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.