మహిషాసురమర్దనీ దేవి అవతారంలో అమ్మవారు

By ramya neerukondaFirst Published Oct 17, 2018, 10:20 AM IST
Highlights

ముదురు నీలం రంగు వస్త్రాలు ధరించి అమ్మ మహిషాసుర మర్దనిగా మనకు దర్శనమిస్తుంది.ఈరోజు అమ్మకు సమర్పించే నైవేద్యం పాయసాన్నం.

 

మహిష మస్తక నృత్త వినోదిని

స్ఫుట రణన్మణి నూపుర మేఖలా

జనన రక్షణ మోక్ష విధాయిని

జయతి శుంభ నిశుంభ నిషూదని

నవరాత్రుల్లో మహర్నవమిగా పేర్కొనే తొమ్మిదవరోజు అమ్మవారు మహిషాసుర మర్దనిగా అవతారం దాల్చుతుంది. మహిషుడిని సంహరించిన అమ్మ ఆపదల్లో మనకు అండగా ఉంటుంది. దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేసి లోకం సుఖ శాంతులతో విలసిల్లే విధంగా కటా పాడుతుంది. ఈరోజు అమ్మను సేవిం     పడంవల్ల మన ఆపదలు, భయాలు అన్నీ తొలగుతాయి.

సనాతని అయిన ఈ తల్లే మహాకటా ళి, త్రిపుర సుందరి, దుర్గ, గౌరి మొదలైన నామాలతో పిలువబడుతున్నది. సర్వాధిష్ఠాత్రి. శివరూపిణి. అన్నపూర్ణ, రాజరాజేశ్వరి. ధర్మం, సత్యం, పుణ్యం, యశస్సు, మంగళాలను ప్రసాదించేది. మోక్షదాయిని. ఆనంద ప్రదాయిని. శోకనాశిని. ఆర్తివినాశిని. తేజస్వరూపిణి. అమ్మవారి పరిపూర్ణ రూపాలలో పరిపూర్ణమైనది. ఈ తల్లి దుష్ట సంహారిణి. శిష్ట సంరక్షణి. మహిషాసుర, చండముండాది రాక్షసులను సంహరించిన వీరమూర్తి. కరుణ కురిపించి కటా పాడే సౌజన్యమూర్తి. కటా రుణ్యమూర్తి.

రాక్షసులు దేహమే తామనుకుంటూ దేహాన్ని రక్షించుకునే ప్రయత్నంలో ఉండేవారు. అందరి దగ్గర శక్తిని గ్రహించేవారు. దేవతలంటే అందరికీ తమ శక్తిని ధారపోసేవారు. అందుకే ఇచ్చేవారు దేవత, తీసుకునేవారు (అసురులు) రాక్షసులు అవుతున్నారు. మహిషం అజ్ఞానానికి   సంకేతం. మూర్ఖత్వానికి  సంకేతం. తాను నమ్మిన సిద్ధాంతంలో మంచి, చెడుల విపక్షణ లేనివాడు మహిషాసురుడు. తన చుట్టూ అటువిం  సామ్రాజ్యాన్నే పెంచుకున్నాడు. అటువిం   అజ్ఞాన సామ్రాజ్యం మీద జ్ఞానం చైతన్యమనేటువిం    విజ్ఞాన ఖడ్గముతో యుద్ధము చేసి వధింపటమే మహిషాసుర మర్దినీ తత్వం.

జయజయహే మహిషాసుర మర్దని రమ్యక పర్దిని శైలసుతే అంటూ అమ్మవారిని ఉగ్రచైతన్య రూపిణిగా కొలవటం వల్ల మనలో ఉండేటటువిం  కటా మ, క్రోధ మోహాదులు అన్నికన్నా ముఖ్యమైన జడత్వం, మూర్ఖత్వం అన్నీ నశింపబడతాయి.  ఈ దేహము ఈ లోకటా నికి   వచ్చినప్పుడు లోకటా న్ని వినియోగించుకోవడం కన్నా లోకటా నికి   వినియోగపడాలి. అలా వినియోగ పడేట్లుగా తయారు చేయడమే ఈ ప్రత్యేకమైన మహిషాసురమర్దినీ తత్వం. అనేక బాహువులు, అనేక ఆయుధాలతో కూడుకున్న అమ్మవారు రూపం ఉగ్రంగా ఉన్నప్పటికీ మానవ శరీరాన్ని మనసును ఆవరించుకున్నటువిం   ఎన్నో రకటా ల లోపాలు తొలగడానికి  ఇటువిం   రూపమే అవసరమౌతుంది. భయం లేకపోతే లోకం మాట వినదు కదా. మన వెనక ఎవరో భయపెట్టేవారు ఉన్నారనుకున్నప్పుడే మనం కొంచం క్రమశిక్షణలో ఉంటా. ఆ తత్వ ఉపాసన ఈ రూపం ద్వారా జరుగుతుంది. ఉపాసకులకు ఈమె ఆనందదాయిని. బద్ధకస్తులకు భయం కలిగించేది. అజ్ఞానంమీద విజ్ఞానం, బాధల మీద   విజయం పొందే తత్వమే ఈ అమ్మవారు పూజలో పరమలక్షం.

ముదురు నీలం రంగు వస్త్రాలు ధరించి అమ్మ మహిషాసుర మర్దనిగా మనకు దర్శనమిస్తుంది.ఈరోజు అమ్మకు సమర్పించే నైవేద్యం పాయసాన్నం.

డా.ఎస్.ప్రతిభ

click me!