
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారం, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని పనుల్లో బంధు మిత్రుల సహకారం ఉంటుంది.
ఆర్ధికంగా అనుకూలం. ఉద్యోగంలో అంచనాలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన విషయాల్లో సొంత ఆలోచనలు కలిసివస్తాయి.
వ్యాపారంలో స్వల్ప లాభాలు అందుకుంటారు. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు కష్ట కాలమే. పిల్లల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు.
ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. నిరుద్యోగులకు అనుకూలం. ప్రముఖుల నుంచి సాయం అందుతుంది.
వాహనయోగం ఉంది. దాయదులతో స్ధిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆర్ధికంగా బాగుంటుంది. వృత్తి, వ్యాపారాలు మెరుగవుతాయి. చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి. అన్నదమ్ములతో ప్రేమగా ఉంటారు.
కొత్త అప్పులకు ప్రయత్నాలు చేస్తారు. ఖర్చుకు తగ్గ ఆదాయం ఉండదు. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగులకు పనిబారం పెరుగుతుంది. ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు వాయిదా పడతాయి.
ఆర్థికంగా బాగుంటుంది. సంతోషంగా ఉంటారు. కొన్ని విషయాల్లో ఆప్తుల సలహాలు కలసివస్తాయి. సమాజంలో విలువ పెరుగుతుంది. ఉద్యోగాల్లో వివాదాలు రాజీకి వస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. సేవా కార్యక్రమాలకు సాయం అందిస్తారు.
కుటుంబ సభ్యులుతో మనస్పర్థలు వస్తాయి. పనులు చాలా శ్రమతో పూర్తవుతాయి. నిరుద్యోగులకు అంతంత మాత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి డబ్బులు ఉండవు.
స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆదరణ పెరుగుతుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి.
ఉద్యోగులకు ప్రశంసలు దక్కుతాయి. సమాజంలో విలువ పెరుగుతుంది. ఊహించని విధంగా డబ్బు వస్తుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్త వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.
ప్రయాణాల్లో ప్రమాద సూచనలున్నాయి. మీ ప్రవర్తన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాల్లో నిరాశే మిగులుతుంది. నిరుద్యోగులకు కలిసిరాదు. గొడవలకు దూరంగా ఉండటం మంచిది.
దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనుల్లో శ్రమ అధికమవుతుంది. బంధు మిత్రులతో మాటపట్టింపులు. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు తెప్పిస్తాయి.