బిర్యానీ ఆకు వంట రుచిని పెంచడానికి మాత్రమే కాదు.. మనకు అదృష్టాన్ని పంచడంలోనూ సహాయం చేస్తుంది. మరి, అదెలాగో తెలుసుకుందామా..
బిర్యానీ ఆకుకు పరిచయం అవసరం లేదు. చాలా రకాల వంట్లో దీనిని వాడతారు. ఇక.. ప్రపంచంలో అందరూ మెచ్చే బిర్యానీ చేయాలంటే కచ్చితంగా ఈ ఆకు ఉండాల్సిందే. ఈ ఆకు చేర్చడం వల్ల వంటకు రుచి , కమ్మని సువాసన తీసుకువస్తుంది. అయితే.. కేవలం ఆహారానికి రుచిని మాత్రమే కాకుండా.. మన జీవితంలో కాస్త అదృష్టాన్ని పెంచడంలోనూ ఈ బిర్యానీ ఆకు మనకు సహాయపడుతుందని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
వాస్తు శాస్త్రంలో బిర్యానీ ఆకు ని శుభం, శ్రేయస్సు , సానుకూల శక్తికి చిహ్నంగా పరిగణిస్తారు. సరైన మార్గంలో ఉపయోగిస్తే, ఇది డబ్బు, ప్రేమ, అదృష్టం, ఆధ్యాత్మిక శక్తిని ఆకర్షించడంలో సహాయపడుతుంది.మీ అదృష్టాన్ని మార్చగల బిర్యానీ ఆకుతో చేయగల చిట్కాలను తెలుసుకుందాం..