Today Rasi Phalalu: ఈ రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు!

Published : Mar 06, 2025, 05:00 AM IST
Today Rasi Phalalu: ఈ రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు!

సారాంశం

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 06.03.2025 గురువారానికి సంబంధించినవి.

మేష రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుది. ఆర్థికంగా అనుకూలం. శ్రమకు తగిన గుర్తింపు దక్కుతుంది. వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు.

వృషభ రాశి ఫలాలు

శుభకార్యాలు నిర్వహిస్తారు. పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకూలం. స్థిరాస్థి వృద్ధి చెందుతుంది. ఊహించని ఆహ్వానాలు అందుతాయి.

మిధున రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాల్లో చికాకు తప్పదు. పనుల్లో అవాంతరాలు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో అకారణంగా మనస్పర్థలు వస్తాయి.

కర్కాటక రాశి ఫలాలు

ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు తప్పవు. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కొత్త పనులకు ఆటంకాలు కలగవచ్చు.

సింహ రాశి ఫలాలు

వ్యాపారాలు అనుకూలం. ఉద్యోగుకు పని ఒత్తిడి తగ్గుతుంది. పిల్లల చదువు బాగుంటుంది. స్నేహితుల సాయంతో పనులు పూర్తి చేస్తారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. ఉద్యోగాల్లో సమస్యలు తప్పవు. పనుల్లో అవాంతరాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కొత్త అప్పులకు ప్రయత్నిస్తారు.

తుల రాశి ఫలాలు

ఉద్యోగులకు అనుకూలం. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. స్థిరాస్తి అమ్మకాలు, కొనుగోళ్లు బాగుంటాయి. ఆకస్మిక విజయం దక్కుతుంది. కొన్ని విషయాల్లో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది.

వృశ్చిక రాశి ఫలాలు

టైంకి నిద్రాహారాలు ఉండవు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక నష్టాలు కలుగుతాయి. ఉద్యోగులకు విమర్శలు తప్పవు. అంతటా చికాకులు పెరుగుతాయి.

ధనస్సు రాశి ఫలాలు

వాహనయోగం ఉంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. ఇంట్లో శుభకార్యాల ప్రయత్నాలు చేస్తారు. బంధువుల ఆదరణ పెరుగుతుంది.

మకర రాశి ఫలాలు

ఊహించని విధంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాల్లో సమస్యలను అధిగమిస్తారు. స్థిరాస్థి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల్లో ఏర్పడిన పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి.

కుంభ రాశి ఫలాలు

చేపట్టిన పనులు అనుకున్న టైంకి పూర్తికావు. శ్రమ పెరుగుతుంది. బంధువులతో కలహాల సూచన ఉంది. ఆలోచనల్లో స్థిరత్వం ఉండదు. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో సమస్యలు తప్పవు.

మీన రాశి ఫలాలు

వ్యాపారాలు అంతంతమాత్రంగా ఉంటాయి. ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొందరి ప్రవర్తన బాధిస్తుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండవచ్చు. పనులు మరింత మందకొడిగా సాగుతాయి.

PREV
click me!

Recommended Stories

Monalisa Bhonsle: చదువుకుందామనుకున్నా సినిమాల్లోకి తీసుకొచ్చారు.. కుంభమేళా మోనాలిసా
Surya Varuna Yogam: అరుదైన సూర్యవరుణ యోగంతో ఈ 3 రాశుల వారికి అప్పుల నుంచి విముక్తి