ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 19.03.2025 బుధవారానికి సంబంధించినవి.
ఆదాయం అంతంత మాత్రమే. వృథా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన విషయాల్లో నిరాశ తప్పదు. ఉద్యోగంలో ట్రాన్స్ ఫర్ సూచనలున్నాయి. ఆప్తులతో మనస్పర్థలు వస్తాయి. వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం దక్కదు.
స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభదాయకం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. పాత బాకీలు తీరుస్తారు. కొన్ని పనులు అనుకోకుండా పూర్తవుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు దక్కుతాయి. ముఖ్యమైన విషయాల్లో సొంత ఆలోచనలు కలసివస్తాయి.
ఉద్యోగంలో పని ఒత్తిడి ఉన్నా పనులు సక్రమంగా పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు మిత్రుల రాకతో సంతోషంగా ఉంటారు. కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి.
ఆదాయం పెరుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లలకు సంబంధించిన శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. పనులు అనుకున్న టైం కి పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలం.
కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు వస్తాయి. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు అతికష్టం మీద పూర్తవుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు వల్ల ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాల్లో ఊహించని సమస్యలు వస్తాయి.
ఆప్తుల సాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి. విలువైన వస్తువులు కొంటారు. స్ధిరాస్తి క్రయ విక్రయాలు లాభదాయకం.
వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా లాభాలు పొందుతారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతగా ఉంటుంది. ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. గృహ నిర్మాణ పనులు ముందుకు సాగుతాయి.
పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు అననుకూలం. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాల్లో అకారణంగా వివాదాలు వస్తాయి.
ఆకస్మిక ప్రయాణాల వల్ల శ్రమ పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కొందరి ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తల్లి తరఫు బంధువుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. భాగస్వామితో కలిసి పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.
వృత్తి, ఉద్యోగంలో గుర్తింపు పెరుగుతుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగుతాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు కలసివస్తాయి.
బంధు మిత్రులతో మాటపట్టింపులు పెరుగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం మంచిది కాదు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగాలు అంతంత మాత్రమే. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.
నిరుద్యోగులకు అనుకూలం. సన్నిహితుల నుంచి ఆశ్చర్యకర విషయాలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.