ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 23.04.2025 బుధవారానికి సంబంధించినవి.
ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణయాలు కలిసిరావు. ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
సన్నిహితుల నుంచి అవసరానికి సహాయం అందుతుంది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. బంధు మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలం.
ఇంటా బయట బాధ్యతలు చికాకు తెప్పిస్తాయి. వ్యాపారం విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో అవరోధాలు వస్తాయి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అన్నదమ్ములతో వివాదాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.
దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆదాయం బాగుంటుంది. సన్నిహితుల సహకారంతో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు అనుకూలం.
అన్నదమ్ములతో స్థిరాస్తి వివాదాలు వస్తాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాల్లో అవరోధాలు వస్తాయి. వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు. ఉద్యోగులకు తోటివారితో మాటపట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలను అధిగమించి లాభాలు అందుకుంటారు. ఇంటా బయట మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాల్లో సన్నిహితుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఉద్యోగ వాతావరణం అనుకూలం.
చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాల్లో ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారపరంగా అనుకూలం. వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. ఇంటి వాతావరణం చికాకుగా ఉంటుంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు.
వ్యాపారంలో భాగస్వాములతో సమస్యలు వస్తాయి. బంధువర్గంతో ఊహించని వివాదాలు వస్తాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి చేతిలో డబ్బు ఉండదు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
ఇంట్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. సన్నిహితుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అవసరానికి కుటుంబ సభ్యుల నుంచి డబ్బు సహాయం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలం. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు.
ఉద్యోగంలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సోదరుల నుంచి డబ్బు సహాయం అందుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
దాయాదులతో ఆకస్మికంగా వివాదాలు వస్తాయి. దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉన్నాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. పిల్లల చదువు విషయాల్లో నిరాశ తప్పదు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.