ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అనవసరఖర్చులు ఉంటా యి. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. చెడు మార్గాలద్వారా ఆదాయ సంపాదన. క్రయ విక్రయాల్లో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ఇబ్బందులు వచ్చే సూచన. శుభకార్యాల్లో పాల్గొనాలనే ఆలోచన ఉంటుంది. మృష్టాన్నభోజనంపైదృష్టి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. అధికారులతో ఒత్తిడి ఏర్పడుతుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సంతృప్తి లభిస్తుంది. శ్రీదత్తాత్రేయ, సాయిబాబా పూజ, శివాభిషేకం, పశువులకు నీరు, సుబ్రహ్మణ్యారాధన మంచి ఫలితాలనిస్తాయి.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : దూర ప్రయాణాలు చేయాలనే తపన ఉంటుంది. నూతన పరిచయాలను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. భాగస్వాములతో అనుకూలత అవసరం. దగ్గరి మిత్రులు. శత్రువులతో జాగ్రత్త. ఆకస్మిక నష్టాలు వచ్చే సూచన. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. సంతృప్తి తగ్గుతుంది. ఇతరులపై ఆధారపడతారు. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. సజ్జన సాంగత్యం అవసరం. శుభకార్యాల్లో పాల్గొనే ప్రయత్నం చేస్తారు. శ్రీదత్తాత్రేయ, సాయిబాబా పూజ, శివాభిషేకం, పశువులకు నీరు, సుబ్రహ్మణ్యారాధన మంచి ఫలితాలనిస్తాయి.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. పోటీతత్వం పెరుగుతుంది. అనారోగ్య భావన. మానసిక ఒత్తిడి ఉంటుంది. నష్టవస్తు పరిజ్ఞానం సంపాదిస్తారు. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి. పదిమందిలో గౌరవంకోసం ఆరాటపడతారు. దూర ప్రయాణాలపై దృష్టి పెడతారు. భాగస్వామ వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. శ్రీదత్తాత్రేయ, సాయిబాబా పూజ, శివాభిషేకం, పశువులకు నీరు, సుబ్రహ్మణ్యారాధన మంచి ఫలితాలనిస్తాయి.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సృజనాత్మకతను కోల్పోతారు. పనులలో ఆటంకాలు ఉంటా యి. మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. శారీరక శ్రమ ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాటం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శతృవులపై విజయం సాధిస్తారు. ఋణసంబంధ ఆలోచనలో మార్పు ఉంటుంది. పోటీ ల్లో విజయం ఉంటుంది. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులు అప్రమత్తత అవసరం. పదిమందిలో గౌరవంకోసం ఆరాటం పెరుగుతుంది. శ్రీదత్తాత్రేయ, సాయిబాబా పూజ, శివాభిషేకం, పశువులకు నీరు, సుబ్రహ్మణ్యారాధన మంచి ఫలితాలనిస్తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఒత్తిడితో సౌకర్యాలు పూర్తి చేస్తారు. అనారోగ్య సూచన కనబడుతుంది. వైద్యశాలల సందర్శనం. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. సుగంధద్రవ్యాలపై దృష్టి ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సంతాన సమస్యలు ఉంటా యి. సృజనాత్మకతను కోల్పోతారు. పరిపాలన సమర్ధత కలిగి ఉంటారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వృత్తి విద్యలపై దృష్టి పెడతారు. పోటీ ల్లో గెలుపుకై ప్రయత్నం. శత్రువులపై విజయకాంక్ష. శ్రీదత్తాత్రేయ, సాయిబాబా పూజ, శివాభిషేకం, పశువులకు నీరు, సుబ్రహ్మణ్యారాధన మంచి ఫలితాలనిస్తాయి.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : మాతృవర్గీయుల సహకారం లభిస్తుంది. విద్యార్థులు శ్రమతో విజయాలను సాధిస్తారు. ప్రచార, ప్రసార సాధనాలు అనుకూలిస్తాయి. దగ్గరి బంధువులతో ప్రయాణం ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. గృహ సంబంధ లోపాలపై దృష్టి ఉంచరాదు. ఆహారంలో సమయపాలన పాటించాలి సంతాన ఆలోచనల్లో సంతృప్తి ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. కళాకారులకు అనుకూల సమయం ఉంటుంది. శ్రీదత్తాత్రేయ, సాయిబాబా పూజ, శివాభిషేకం, పశువులకు నీరు, సుబ్రహ్మణ్యారాధన మంచి ఫలితాలనిస్తాయి.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : నిల్వధనంపై దృష్టి పెరుగుతుంది. దృష్టి సంబంధ దోషాల్లో ఒత్తిడి పెరుగుతుంది. మాటల్లోఆకర్షణ పెరుగుతుంది. కుటుంబీకుల సహకారం పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల సమయాలు ఏర్పడతాయి. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. కమ్యూనికేషన్స్ అనుకూలిస్తాయి. పరామర్శలు చేస్తారు. చిత్త చాంచల్యం తగ్గించుకోవాలి. ప్రాథమిక సౌకర్యాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. అభివృద్ధికి ఆటంకాలు ఏర్పరుస్తారు. శ్రీదత్తాత్రేయ, సాయిబాబా పూజ, శివాభిషేకం, పశువులకు నీరు, సుబ్రహ్మణ్యారాధన మంచి ఫలితాలనిస్తాయి.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : అభిరుచులకు అనుగుణంగా ఆలోచనల్లో మార్పుల ఉంటా యి. శత్రువులపై విజయం ఉంటుంది. వాగ్దోరణి మారుతుంది. కుటుంబంలో ఒత్తిడి ఏర్పడుతుంది. నిల్వ ధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మాతృవర్గీయుల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలత ఏర్పడుతుంది. కమ్యూనికేషన్స్ అనుకూలిస్తాయి. పరామర్శలు చేస్తారు. ప్రచార, ప్రసార సాధనాల వల్ల సంతోషం కలుగుతుంది. శ్రీదత్తాత్రేయ, సాయిబాబా పూజ, శివాభిషేకం, పశువులకు నీరు, సుబ్రహ్మణ్యారాధన, దుర్గారాధన. మంచి ఫలితాలనిస్తాయి.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : విశ్రాంతి లభిస్తుంది. మానసిక ఒత్తిడి ఉంటుంది. సుఖంకోసం ఆలోచిస్తారు. అన్ని రకాల ఖర్చులు ఉంటా యి. నిత్యావసర ఖర్చులపై దృష్టి అధికంగా చేస్తారు. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాటపడతారు. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికల మార్పు. మాట విలువ తగ్గుతుంది. కుటుంబంలో అసౌకర్యం కలుగుతుంది. నిల్వ ధనాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు. నేత్ర సంబంధ లోపాలు ఉంటా యి. శ్రీదత్తాత్రేయ, సాయిబాబా పూజ, శివాభిషేకం, పశువులకు నీరు, సుబ్రహ్మణ్యారాధన మంచి ఫలితాలనిస్తాయి.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : కళాకారులకు అనుకూల సమయం. అనుకున్న పని చేయడంలో పెద్దల ఆశీస్సులు ఉంటాయి. సమిష్టి ఆదాయాలు. స్త్రీల ద్వారా ఆదాయ మార్గ సూచన. విశ్రాంతికై ప్రయత్నిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. సుఖం కోసం ఆలోచన పెరుగుతుంది. అన్ని విధాల ఖర్చులు ఉంటా యి. కలలో విహరిస్తూ ఉంటా రు. పరాధీనత ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం లభించదు. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. చిత్త చాంచల్యం ఉంటుంది. శ్రీదత్తాత్రేయ, సాయిబాబా పూజ, శివాభిషేకం, పశువులకు నీరు, సుబ్రహ్మణ్యారాధన మంచి ఫలితాలనిస్తాయి.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతి ఏర్పడుతుంది. సంఘంలో గౌరవం కీర్తిప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కళలపై ఆసక్తి పెరుగుతుంది. కళాకారులకు అనుకూల సమయం. సమిష్టి ఆశయాలు సాధిస్తారు. నిత్యావసర ఖర్చులకై ప్రయత్నం చేస్తారు. అనవసర ఖర్చులుఉంటా యి. విశ్రాంతికై ప్రయత్నం. పాదాల నొప్పులు. విహార యాత్రలపై దృష్టి ఉంటుంది. శ్రీదత్తాత్రేయ, సాయిబాబా పూజ, శివాభిషేకం, పశువులకు నీరు, సుబ్రహ్మణ్యారాధన మంచి ఫలితాలనిస్తాయి.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అధికారులతో అప్రమత్తత అవసరం. అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. పరిశోధకులు కష్టకాలం. విదేశీ వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. పరిశోధనలు చేస్తారు. పరాక్రమాల్లో లోపాలు. వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్త అవసరం. సంఘంలో గౌరవంకోసంఆరాట పడతారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కళలపై ఆసక్తి పెరుగుతుంది. కళాకారులకు అనుకూల సమయం ఉంటుంది. శ్రీదత్తాత్రేయ, సాయిబాబా పూజ, శివాభిషేకం, పశువులకు నీరు, సుబ్రహ్మణ్యారాధన మంచి ఫలితాలనిస్తాయి.
డా.ఎస్.ప్రతిభ
read more news
ఏ రాశివారి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఏ మాసంలో పుట్టినవారు ఎలాంటి స్వభావం కలవారు
అక్టోబర్ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి