12అక్టోబర్ 2018 శుక్రవారం రాశిఫలాలు

By ramya neerukonda  |  First Published Oct 12, 2018, 9:34 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అనవసర ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు ఉండాలి. అనారోగ్య భావన ఉంటుంది. క్రయవిక్రయాలు ఉంటాయి. పరాశ్రయం ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. పరిశోధనలపై ఆసక్తి ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిడి ఉంటుంది. శ్రీ దత్త శ్శరణం మమ అనే జపం చేసుకోవడం మంచిది.    

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి. నూతన పరిచయాలు అసౌకర్యం కలిగిస్తాయి. పనుల్లో ఆటంకాలు. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల్లో ప్రమాదాలకు అవకాశం.అనారోగ్య సూచన. పరామర్శలకుఅవకాశం. వైద్యశాలలసందర్శనం. శ్రీ దత్త శ్శరణంమమ జపంచేసుకోవడం మంచిది.    

Latest Videos

undefined

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : పోటీల్లో గెలుపుకై తపన. అనుకోని ఆటంకాలు. శ్రమాధిక్యం ఉంటుంది. రోగనిరోధక శక్తి పెంపు. పదిమందిలో గౌరవంకోసం ఆరాటం. అనవసర ఒత్తిడులు ఉంటాయి. పనుల్లో ఆలస్యం జరుగుతుది. నూతన పరిచయాలు ఒత్తిడిని కలుగజేస్తాయి. శ్రీదత్తశ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సంతాన సమస్యలు తగ్గుతాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది.   సృజనాత్మకత పెరుగుతుంది. రోగనిరోధక శక్తి పెంపు. దూర ప్రయాణాలపై ఆసక్తి కలుగుతుంది. శత్రువులపై విజయం. ఋణ ఆలోచనల్లో విముక్తి ఉంటుంది. వృత్తి విద్యలపై విజయం. సంతృప్తి.  శ్రీ దత్త శ్శరణంమమ జపం చేసుకోవడం మంచిది.    

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఒత్తిడితో సౌకర్యాలు పూర్తి. గృహసౌఖ్యంకోసం ఆరాటం. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆహారంలో సమయపాలన పాటించాలి. విద్యార్థులకు ఒత్తిడికాలం. మానసిక ఒత్తిడి అధికం. సృజనాత్మకతను కోల్పోతారు. సంతాన సమస్యలు ఉంటాయి. ఆత్మీయత లోపిస్తుంది.  శ్రీ దత్త శ్శరణంమమ జపం చేసుకోవడం మంచిది.    

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సహకారంవల్ల ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. పరామర్శలు ఉంటాయి. కమ్యూనికేషన్స్‌ వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. అనారోగ్య భావన. వైద్యశాలల సందర్శనం. సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. ఆహారంలో సమయపాలన అవసరం. శ్రీ దత్త శ్శరణంమమ జపం చేసుకోవడం మంచిది.    

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : నిల్వ ధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వాగ్దానాల వల్ల ఒత్తిడి ఉంటుంది. మాట విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. సేవకజన సహకారాలు లాభిస్తాయి. విద్యార్థులు శ్రమతో విజయాలు సాధిస్తారు. శ్రీ దత్త శ్శరణంమమ జపం చేసుకోవడం మంచిది.  

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : శారీరకశ్రమ ఉంటుంది. అనుకున్న పనుల్లో ఆటంకాలు. అభిరుచులకు తగిన ఆలోచనల మార్పు అవసరం. పట్టుదలతో కార్యసాధన చేయాలి. వాగ్దానాల వల్ల ఇబ్బందులు. మాట విలువ తగ్గుతుంది. కుటుంబంలో మస్యలు ఉంటాయి. ఆర్థికనిల్వలు కోల్పోయేసూచన ఉంటుంది. శ్రీదత్త శ్శరణంమమ జపం చేసుకోవడం మంచిది.  

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలకోసం ధనం వెచ్చిస్తారు. విశ్రాంతి లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాటం పెరుగుతుంది. పట్టుదలతో కార్యసాధన చేయాలి. చక్కని ప్రయత్నం చేయాలి. శ్రీ దత్త శ్శరణంమమ జపం చేసుకోవడం మంచిది.  

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : పెద్దల ఆశీస్సులు ఉంటాయి. సమిష్టి ఆదాయాల సూచన. కళలపై ఆసక్తి పెరుగుతుంది. విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులకు స్థాన చలనం సూచన ఉంది. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతృప్తి లభిస్తుంది. శ్రీ దత్త శ్శరణంమమ జపం చేసుకోవడం మంచిది.  

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : చేసే వృత్తులలో ఒత్తిడి ఉంటుంది. అధికారులతో అప్రమత్తత అవసరం. శ్రమాధిక్యం ఉంటుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కళాకారులకు ఆసక్తి పెరుగుతుంది. సమిష్టి ఆదాయాలు ఉంటాయి. సేవకులద్వారా సంతోషం ఉంటుంది. శ్రీ దత్త శ్శరణంమమ జపం చేసుకోవడం మంచిది.  

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. సజ్జన సాంగత్యం ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొటారు. దూరదృష్టి ఉంటుంది. అనుకోని ఇబ్బందులు ఉంటాయి. మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. అధికారులతో అప్రమత్తత అవసరం. కీర్తి ప్రతిష్టలకై ఆలోచన. జాగ్రత్త అవసరం. శ్రీ దత్త శ్శరణంమమ జపం చేసుకోవడం మంచిది.  

డా.ఎస్.ప్రతిభ

click me!