3 సెప్టెంబర్ 2018 సోమవారం మీ రాశిఫలాలు

By ramya neerukonda  |  First Published Sep 3, 2018, 9:35 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి


మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : నిల్వధనాలు కోల్పోతారు. కుటుంబంలో ఆటంకాలు ఏర్పడతాయి. కంటి సంబంధ ఆలోచనలు పెరుగుతాయి. మాట విలువ తగ్గుతుంది.
స్నేహ సంబంధాల్లో జాగ్రత్తగా ఉండాలి. సహాయం కోరంఎదురు చూపులు ఉంటాయి. సంపాదనకు ప్రయత్నం చేస్తారు. లలితాపారాయణ చేయడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : మృష్టాన్న భోజన ప్రాప్తి ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆలోచనల్లో మార్పులు ఉంటాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కృషి శీలత అధికంగా ఉంటుంది. ఆశయాలకు అనుగుణంగా కార్యాచరణ ఉంటుంది. లలితా పారాయణ మంచి ఫలితాలనిస్తుంది.

Latest Videos

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : నిత్యావసర ఖర్చులు అధికంగా ఉంటాయి. సుఖం కోసం ఆలోచన పెరుగుతుంది. విశ్రాంతిని కోల్పోతారు. పాదాల నొప్పులు ఉంటాయి. దేశాంతర ప్రయాణం. విహార యాత్రలకు ఆలోచన చేస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. పరాధీనత ఉంటుంది. శ్రీరామజపం చేసుకోవడం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : అన్ని రకాల ఆదాయాలు ఉంటాయి. స్త్రీల ద్వారా ఆదాయం వచ్చే సూచన. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కళలపై ఆసక్తి
పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడతారు. ఉపాసనను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. శ్రీరామ జయరామ జయజయరామ రామ జపం చేసుకోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సంఘంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. అన్ని రకాల సౌఖ్యం లభిస్తుంది.
తండ్రితో అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో తోటి వారితో ఆనందం ఏర్పడుతుంది. శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచి ఫలితాలనిస్తుంది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : అధికారులతో భయం ఏర్పడుతుంది. దూర ప్రయాణాలపై ఆసక్తి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శుభకార్యాల్లో పాల్గొనాలనే ఆలోచన పెరుగుతుంది. పరిశోధనలకోసం ప్రయత్నం చేస్తారు. న్యాయ అన్యాయ విచారణ చేసు కుంటారు. లలితాసహస్రనామ పారాయణం చేయడం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అనారోగ్య భయం ఉంటుంది. అనవసర ఖర్చులు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. ఆకస్మిక ఇబ్బందులు
ఏర్పడతాయి. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. అవమానాలు రాకుండా జాగ్రత్త పడాలి. పరాధీనం ఉంటుంది. లలితాసహస్రనామ పారాయణం చేయడం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : వ్యాపార అభివృద్ధి ఉంటుంది. నష్టవస్తు పరిజ్ఞానం లభిస్తుంది. భాగస్వామ్య అనుబంధాల్లో అనుకూలత ఏర్పడుతుంది. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. పదిమందిలో గౌరవం లభిస్తుంది. సుగంధ ద్రవ్యాలపై ఆలోచన పెరుగుతుంది. శ్రీరామ జయరామ జయజయరామ రామ జపం చేసుకోవడం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శతృవులపై విజయం సాధిస్తారు. ఋణాల వల్ల సంతోషం కలుగుతుంది. వృత్తి విద్యల్లో ఆనందంఏర్పడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పోటీల్లో గెలుపు సాధిస్తారు. శారీరక వ్యాయామాలు అవసరం. పరాధీన ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయరామ రామ జపం చేసుకోవడం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : మానసిక ప్రశాంతతను కోల్పోతారు. సృజనాత్మక తగ్గుతుంది. పరిపాలన సమర్ధత ఉండదు. మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. సంతానం వల్ల సమస్యలు ఏర్పడతాయి. దీక్షలపై దృష్టి తగ్గుతుంది. ఉన్నత విద్యలపై ప్రయత్నిస్తారు. లలితాసహస్రనామ పారాయణం చేయడం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సౌకర్యాల వల్ల ఆటంకాలు కలుగుతాయి. ఆహారంలో సమయ పాలన అవసరం. కృషి తగిన ఫలితం లభించదు. గృహసంబంధ ఆలోచనలు పెరుగుతాయి. లలితా సహస్రనామ పారాయణ మంచి ఫలితాలనిస్తుంది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : స్త్రీల వల్ల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలపై ఆలోచన ఉంటుంది. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. ధనలాభం ఉంటుంది. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. పరామర్శలు చేస్తారు. పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. లలితాసహస్రనామ పారాయణం చేయడం మంచిది.

డా.ప్రతిభ

ఇవి కూడా చదవండి

ఈ సెప్టెంబర్ నెల రాశిఫలాలు

ఈ వారం( ఆగస్టు31వ తేదీ నుంచి సెప్టెంబర్వ6 తేదీ వరకు) రాశిఫలాలు ఇలా ఉన్నాయి

click me!