రేపు ఆకాశంలో బ్లడ్ మూన్.. ఏ రాశులవారికి కలిసొస్తుంది.

Published : Jul 26, 2018, 01:19 PM IST
రేపు ఆకాశంలో బ్లడ్ మూన్.. ఏ రాశులవారికి కలిసొస్తుంది.

సారాంశం

కనులవిందు చేయనున్న ఈ అరుణ వర్ణ చంద్రుడు.. కొన్ని రాశుల వారికి అనుకూలంగానూ.. మరికొన్ని రాశులవారికి ప్రతికూలంగానూ ఉన్నాడు.

ఈ శతాబ్దిలోనే సుదీర్ఘమైన చంద్ర గ్రహణం శుక్రవారం ఏర్పడనుంది. జులై 27 రాత్రి నుంచి జులై 28 వేకువజాము వరకు ఈ గ్రహణం కొనసాగనుంది. ఈ చంద్ర గ్రహణాన్ని భారత్‌లోనూ వీక్షించే వీలుంది. ఆ సమయంలో చంద్రుడు అరుణ వర్ణంలో కనువిందు చేయనున్నాడు. 

భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటల 44 నిమిషాలకు గ్రహణం ప్రారంభం అవుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. దాదాపు 103 నిమిషాలపాటు సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. శనివారం వేకువ జామున 3.49 గంటల వరకు గ్రహణం కొనసాగుతుంది. 4.58 గంటలకు గ్రహణ ప్రభావం పూర్తిగా తొలుగుతుంది.

గర్భిణులు, కంటి సంబంధిత వ్యాధులు ఉన్నవారు గ్రహణాన్ని వీక్షించకపోవడం మంచిది. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు రాత్రి 7.30 గంటల్లోగా భోజనం ముగించడం మంచిది. త్వరగా జీర్ణం కావడానికి టిఫిన్ చేయడం ఉత్తమం. 

కనులవిందు చేయనున్న ఈ అరుణ వర్ణ చంద్రుడు.. కొన్ని రాశుల వారికి అనుకూలంగానూ.. మరికొన్ని రాశులవారికి ప్రతికూలంగానూ ఉన్నాడు. ఇది ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాల్లో వస్తోన్న కేతుగ్రస్త చంద్ర గ్రహణం. గ్రహణం ముగిశాక స్నానం చేసి పూజాధికాలు, దానధర్మాలు చేయడం అందరికీ శుభం కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు. 

గ్రహణ సమయంలో ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి. మేష రాశి వారు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఉత్తరాషాఢ నక్షత్రం నాలుగో పాదం, శ్రవణ, ధనిష్ఠ 1,2 పాదాలు, మకర రాశిలో జన్మించిన వారు ఈ గ్రహణాన్ని వీక్షించకపోవడం ఉత్తమం. 41 రోజుల్లోపు గ్రహణ జపం, శాంతి హోమం, దానం చేయించుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.


మిథున, తుల, కుంభ రాశుల వారు ఆరు నెలలపాటు జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం వీడిన 11 రోజుల్లోగా నవగ్రహ పూజ, శివుడికి అభిషేకం చేయించుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు. 

ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాలకు చెందిన గ్రహణానికి నాలుగు గంటల ముందే భోజనం చేయాలి. గ్రహణం విడిచిన తర్వాత స్నానం ఆచరించాలి. దీపారాధన చేసి భగవంతుణ్ని స్మరించాలి. 

మేషం, సింహం, వృశ్చికం, మీన రాశుల వారికి ఈ గ్రహణ ప్రభావం అనుకూలంగా ఉంటుంది. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ధనయోగం, నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వీరు గ్రహణ సమయంలో ఇష్టదైవాన్ని స్మరించాలి. 

 

ఈ వార్తలు కూడా చదవండి..

అతి పెద్ద బ్లడ్ మూన్ ... కనులారా చూడొచ్చు

 

PREV
click me!

Recommended Stories

AI Horoscope: ఓ రాశివారు శుభవార్తలు వింటారు..!
Today Rasi Phalalu: నేడు ఈ రాశివారు స్త్రీ సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి!