26 జులై, 2018 గురువారం మీ రాశిఫలాలు

 |  First Published Jul 26, 2018, 9:35 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి


మేషం

మేషం :ఈ రోజు ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. తొందరపాటు కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి వినోదయాత్ర చేస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. మీ సంతానం కారణంగా ఆనందాన్ని పొందుతారు. వివాహ సంబంధ విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు.

వృషభం

వృషభం : ఆరోగ్య విషయంలోజాగ్రత్త అవసరం. చేతులు, చెవులు తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశ ముంటుంది. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపవలసి రావటం కానీ, ఏదైనా అడ్డంకి ఎదురవటం కానీ జరగవచ్చు. ఇతరులతో వ్యవహరించేప్పుడు జాగ్రత్త అవసరం. అనవసర వివాదాలు ఏర్పడవచ్చు.

మిథునం

Latest Videos

undefined

మిథునం :ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆం దోళనలు తగ్గుతాయి. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవితభాగస్వామి కొరకు లేదా కుటుం బ సభ్యుల కొరకు డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం. చర్చలకు, కమ్యునికేషన్ కు అనుకూలం

కర్కాటకం

కర్కాటకం :ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడు తుంది. గృహ సంబంధ వ్యవహారాలలో బిజీగా గడుపుతారు. మీ తల్లిగారి తరపు బంధువులను కలుసుకుంటారు. మీ గృహానికి సంబంధించి కొనుగోలు వ్యవహారాలు లేదా ఇతర లావాదేవీలు ఒక కొలిక్కి వస్తా యి. కోర్టు కేసులు కానీ, వివాదాలు కానీ పరిష్కరించబడతాయి.

సింహం

సింహం :ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్ర యాణం కానీ, ఉద్యోగంలో మార్పు కానీ ఉం టుంది. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు. దైవ దర్శనం చేసుకోవటం కానీ, ఆధ్యాత్మిక క్షేతాల్ని సందర్శించటం కానీ చేస్తారు.

కన్య

కన్య :ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు లేదా భూ సంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి. ప్రశాంత చిత్తంతో ఉంటేనే అన్ని పనులు చేయగలుగుతారు.

తుల

తుల :ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా బదిలీ కొరకు ఎదురుచూస్తున్నవారికి ఈ రోజు ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

వృశ్చికం

వృశ్చికం :ఈ రోజు మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పని చేయటానికి బద్ధకిస్తారు. అలాగే ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది. దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.

ధనుస్సు

ధనుస్సు : ఆర్థికంగా అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువులను కానీ, స్నేహితులను కానీ కలుసుకుంటారు. గృహ సంబంధ లావాదేవీలు, ఒప్పందాలు పూర్తి చేస్తారు.

మకరం

మకరం :ఈ రోజు బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవ ర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఏమరుపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశముంటుంది.

కుంభం

కుంభం: మీరు ఈ రోజు ఆనందంగా గడుపుతారు. అనుకున్న పను లు నెరవేర్చుకోగలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోదకార్యక్రమాల్లో మునిగితేలుతారు. మీ జివిత భాగస్వామితో కలిసి ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు.

మీనం

మీనం : ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే దానికి ఈ రోజు చాలా అనుకూలమైనది. మీరు ప్రారంభంచేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. ఆటంకాలు తొలగిపోతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. స్త్రీ విషయంలో కల్పించుకోకండి.

click me!