అతి పెద్ద బ్లడ్ మూన్ ... కనులారా చూడొచ్చు

First Published Jul 26, 2018, 12:47 PM IST
Highlights

ఇండియాలో ఈ గ్రహణాన్ని స్పష్టంగా చూసేందుకు వీలున్నా.. కొన్ని ప్రాంతాల్లో దట్టమైన మేఘాల వల్ల ఆ అవకాశం దక్కకపోవచ్చు. ఢిల్లీ, పుణె, బెంగళూరు, ముంబయిలలో ఈ గ్రహణం స్పష్టంగా కనిపించనుంది. 

ఎప్పుడూ తెల్లగా ఉండే చంద్రుడు.. అరుణ వర్ణంలోకి మారిపోనున్నాడు. ఈ శతాబ్దిలోనే సుద్ధీర్ఘమైన చంద్ర గ్రహణం శుక్రవారం ఏర్పడనుంది. ఇండియాలో జులై 27 (శుక్రవారం) రాత్రి సరిగ్గా 11.44 గంటలకు నుంచి చంద్ర గ్రహణం మొదలవుతుంది. సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని చూడాలంటే అర్ధరాత్రి వరకు వేచి చూడాల్సిందే. 

అర్ధరాత్రి 1.51 గంటలకు ఏర్పడే సంపూర్ణ చంద్ర గ్రహణం.. 2.43 గంటల వరకు కొనసాగుతుంది. అయితే, ఇండియాలో ఈ గ్రహణాన్ని స్పష్టంగా చూసేందుకు వీలున్నా.. కొన్ని ప్రాంతాల్లో దట్టమైన మేఘాల వల్ల ఆ అవకాశం దక్కకపోవచ్చు. ఢిల్లీ, పుణె, బెంగళూరు, ముంబయిలలో ఈ గ్రహణం స్పష్టంగా కనిపించనుంది. 

మళ్లీ ఇలాంటి సుదీర్ఘ చంద్ర గ్రహణం 2123, జూన్ 9న ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏర్పడే గ్రహణాన్ని అస్సలు మిస్ కావద్దు. ఈ గ్రహణం దక్షిణ అమెరికా, తూర్పు ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, మధ్య ఆసియా దేశాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. 

 

click me!