పవన్ కల్యాణ్ తో మాగుంట శ్రీనివాసులు రెడ్డి: జనసేన వైపు చూపు?

Published : Mar 05, 2019, 03:54 PM IST
పవన్ కల్యాణ్ తో మాగుంట శ్రీనివాసులు రెడ్డి: జనసేన వైపు చూపు?

సారాంశం

మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు పార్లమెంటు సీటు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన టీడీపి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఒంగోలు నుంచి పోటీ చేసే ఉద్దేశంతో ఆయన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలని అనుకుంటున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

ఒంగోలు: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. ఇరువురి మధ్య దాదాపు 20 నిమిషాల పాటు చర్చలు జరిగాయి.

మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు పార్లమెంటు సీటు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన టీడీపి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఒంగోలు నుంచి పోటీ చేసే ఉద్దేశంతో ఆయన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలని అనుకుంటున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

ఆ వార్తల నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యారు. దీంతో వైసిపిలో చేరే అలోచనను ఆయన విరమించుకున్నట్లు భావించారు.

ఒంగోలు పార్లమెంటు సీటును తనకు కేటాయించడానికి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కేటాయించడానికి వైసిపి సముఖంగా లేదని సమాచారం. దీంతో మాగుంట జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.  

PREV
click me!

Recommended Stories

New year Celebrations : మూగచెవిటి పిల్లలతో కేక్ కట్ చేయించిన ఆళ్లనాని
పార్లమెంట్ లో వైసీపీ మహిళాశక్తి: ఆ నలుగురు.....