విశాఖపట్టణం స్థానికేతరుల ఖిల్లా

By narsimha lodeFirst Published Mar 5, 2019, 3:18 PM IST
Highlights

: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ పట్టణం ఎంపీ సెగ్మెంట్‌లో  స్థానికేతరులే ఎక్కువ సార్లు ఎంపీగా విజయం సాధించారు.


విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ పట్టణం ఎంపీ సెగ్మెంట్‌లో  స్థానికేతరులే ఎక్కువ సార్లు ఎంపీగా విజయం సాధించారు.ఈ స్థానంలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు విజయం సాధించగా, ఆ తర్వాతి స్థానంలో టీడీపీ నిలిచింది. మూడు దఫాలు టీడీపీ ఈ స్థానాన్ని దక్కించుకొంది. 2014 ఎన్నికల్లో తొలిసారిగా ఈ స్థానంలో బీజేపీ  అభ్యర్ధి కంభంపాటి హరిబాబు నెగ్గారు.

ఈ పార్లమెంట్ స్థానం నుండి రెండు దశాబ్దాలుగా స్థానికులు ఎవరూ కూడ ఈ స్థానం నుండి ఎంపీగా విజయం సాధించలేదని ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి.

గత ఎన్నికల సమయంలో విశాఖ పట్టణం నుండి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన హరిబాబు కూడ విశాఖకు చెందినవాడు కాదంటారు. బీటెక్ డిగ్రీ, పీహెచ్‌డీని హరిబాబు విశాఖలో చేశారని చెబుతారు. కానీ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతంలో హరిబాబు జన్మించాడంటారు. 

1952, 1957 , 1967, 1984,1991,1999, 2014 ఎన్నికల్లో  విశాఖ ఎంపీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేదు. 

1952లో స్వతంత్ర అభ్యర్ధి లంకా సుందరం, గాం మల్లుదొరలు విజయం సాధించారు.  1957లో  మహారాజా పూసపాటి విజయ రామ గజపతిరాజు సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. 1967లో ప్రోగేసివ్ గ్రూప్ నుండి తెన్నేటీ విశ్వనాథం విజయం సాధించారు.

1980లో  కొమ్మూరు అప్పలస్వామి కాంగ్రెస్(ఐ) అభ్యర్ధిగా పోటీ చేసి నెగ్గారు. 1984లో భాట్టం శ్రీరామమూర్తి టీడీపీ అభ్యర్ధిగా తొలిసారి పోటీ చేసి నెగ్గారు.1991లో ఎంవీవీఎస్ మూర్తి, 1999లో కూడ మూర్తి టీడీపీ అభ్యర్థిగా ఈ స్థానం నుండి నెగ్గారు. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మపై కంభంపాటి హరిబాబు నెగ్గారు.

విశాఖ ఎంపీ పదవితో పాటు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడ హరిబాబుకు ఉండేది. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా  బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కన్నా లక్ష్మీనారాయణకు కట్టబెట్టారు. టీడీపీ పట్ల హరిబాబు కొంత మెతక వైఖరి అవలంభిస్తున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. మరోవైపు చంద్రబాబునాయుడు సామాజిక వర్గం హరిబాబు సామాజిక వర్గం కూడ ఒక్కటే కావడంతో మెతకవైఖరి ఉందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య పోరు ఈ నియోజకవర్గంలో అభ్యర్ధుల గెలుపు ఓటములను కూడ ప్రభావితం చూపే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

click me!