జగన్! పిచ్చి వేషాలు వెయ్యకు, దమ్ముంటే డైరెక్ట్ గా రా!!: కేఏ పాల్

Published : Apr 06, 2019, 06:55 PM ISTUpdated : Apr 06, 2019, 07:05 PM IST
జగన్! పిచ్చి వేషాలు వెయ్యకు, దమ్ముంటే డైరెక్ట్ గా రా!!: కేఏ పాల్

సారాంశం

తనపై అర్థరాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు దాడి చేశారని ఆరోపించారు. రాత్రి సీసీ ఫుటేజ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీసీ ఫుటేజ్ లేదని చెప్పడంతో ఆయన కోపంతో రగిలిపోయారు. వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అనంతరం హోటల్ సిబ్బంది సీసీ ఫుటేజ్ ఇవ్వడంతో శాంతించారు.  

ఏలూరు: భీమవరంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హల్ చల్ చేశారు. తనపై రాత్రి దాడి జరిగిందని ఆరోపిస్తూ నానా హంగామా చేశారు. భీమవరం అతిథిహోటల్ లో బస చేసిన కేఏ పాల్ ఉదయం రిసెప్షన్ దగ్గరకు వచ్చి హడావిడి చేశారు. 

తనపై అర్థరాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు దాడి చేశారని ఆరోపించారు. రాత్రి సీసీ ఫుటేజ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీసీ ఫుటేజ్ లేదని చెప్పడంతో ఆయన కోపంతో రగిలిపోయారు. వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

అనంతరం హోటల్ సిబ్బంది సీసీ ఫుటేజ్ ఇవ్వడంతో శాంతించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడి చేశారంటూ విరుచుకుపడ్డారు. 

తనపై దాడి చేసిన వారి ఫోటోలు, గుర్తులు, మరిన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెప్పుకొచ్చారు. గతంలో తాను బస చేసిన చోట వచ్చిన వారే శుక్రవారం రాత్రి వచ్చారని ఆరోపించారు. 

దమ్ముంటే వైఎస్ జగన్ తనతో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. చర్చకు రావాలి లేదా దేనికైనా రెడీ అంటూ సవాల్ విసిరారు. చేతకాని పిచ్చి పిచ్చి వేషాలు ఎందుకు వేస్తావంటూ చిందులు వేశారు. చిల్లర చిల్లర ఎందుకు వేస్తావ్ అంటూ మండిపడ్డారు కేఏ పాల్.   

PREV
click me!

Recommended Stories

New year Celebrations : మూగచెవిటి పిల్లలతో కేక్ కట్ చేయించిన ఆళ్లనాని
పార్లమెంట్ లో వైసీపీ మహిళాశక్తి: ఆ నలుగురు.....