జనసేన అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ నూతన ఒరవడి: రూ.100 బాండ్ పై మేనిఫెస్టో రిలీజ్

Published : Apr 06, 2019, 05:13 PM IST
జనసేన అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ నూతన ఒరవడి: రూ.100 బాండ్ పై మేనిఫెస్టో రిలీజ్

సారాంశం

 బాండ్ పేపర్ పై తాను విశాఖపట్నంలోనే ఉంటానని ప్రకటించారు. విశాఖపట్నంను క్లీన్, సేఫ్, హ్యాపీ సీటిగా తీర్చి దిద్దుతామని లక్ష్మీనారాయణ రూ.100బాండ్ పేపర్ పై హామీ ఇచ్చారు. 

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు విశాఖపట్నం జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ. ఎన్నికల ప్రచారంలో తాను విశాఖపట్నంలోనే ఉంటానని అవసరమైతే బాండ్ పేపర్ పై రాసిస్తానని ప్రచారం చేస్తున్నారు లక్ష్మీనారాయణ. 

అయితే శనివారం ఉగాది పర్వదినాన ఆ ప్రచారాన్ని నిజం చేశారు. బాండ్ పేపర్ పై తాను విశాఖపట్నంలోనే ఉంటానని ప్రకటించారు. విశాఖపట్నంను క్లీన్, సేఫ్, హ్యాపీ సీటిగా తీర్చి దిద్దుతామని లక్ష్మీనారాయణ రూ.100బాండ్ పేపర్ పై హామీ ఇచ్చారు. 

వీటితోపాటు విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో చేపట్టబోయే కార్యక్రమాలను సైతం బాండ్ పేపర్ పై పొందుపరిచారు. తాను ఎంపీగా గెలిచిన తర్వాత ప్రతీ హామీని నెరవేరుస్తానని వీవీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

New year Celebrations : మూగచెవిటి పిల్లలతో కేక్ కట్ చేయించిన ఆళ్లనాని
పార్లమెంట్ లో వైసీపీ మహిళాశక్తి: ఆ నలుగురు.....