రూ.2 కోట్ల తరలింపు: టీడీపి ఎంపీ మురళీమోహన్ పై తెలంగాణలో కేసు

By Nagaraju penumalaFirst Published Apr 4, 2019, 1:19 PM IST
Highlights

 మాదాపూర్ లో దొరికిన రూ.2కోట్ల రూపాయలు జయభేరీ సంస్థకు చెందినవేనని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఆ నగదును టీడీపీ ఎంపీ మురళీమోహన్ కు చేరవేసేందుకు వారు ప్రయత్నించారని నిర్ధారించారు. 

హైదరాబాద్: మాదాపూర్ లో దొరికిన రూ.2కోట్ల రూపాయలు జయభేరీ సంస్థకు చెందినవేనని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఆ నగదును టీడీపీ ఎంపీ మురళీమోహన్ కు చేరవేసేందుకు వారు ప్రయత్నించారని నిర్ధారించారు. 

బుధవారం రైల్వేస్టేషన్ సమీపంలో అనుమానంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఎస్.ఓటి పోలీసులు వారి బ్యాగులను సోదా చెయ్యగా రెండు కోట్ల రూపాయలు ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

జయభేరి కనస్ట్రక్షన్స్ సంస్థకు చెందిన ఉద్యోగులు ధర్మరాజు, జగన్మోహన్ లు ఈ డబ్బులు ఇచచినట్లు పోలీసులకు దొరికిన నిమ్మలూరు శ్రీహరి, పండరిలు చెప్పినట్లు తెలిపారు. ఈ నగదును రైలులో రాజమండ్రికి తీసుకెళ్లాలని వారు ఆదేశించడంతో బ్యాగులతో బయలు దేరినట్లు పోలీసుల విచారణలో తేలిందని స్పష్టం చేశారు. 

రైలు మార్గంలో రూ.2కోట్ల నగదును రాజమండ్రిలోని యలమంచిలి మురళీమోహన్ అనే వ్యక్తికి చెందిన కారులో వెళ్లి టీడీపీ ఎంపీ మురళీమోహన్ కు అప్పగించాలని ఆదేశించారని నిందితులు చెప్పినట్లు తెలిపారు. 

రాజమండ్రి రైల్వే స్టేషన్ దిగిన తర్వాత బయట యలమంచిలి మురళీమోహన్ కారులోవెయిట్ చేస్తూ ఉంటారని జయభేరి ఉద్యోగులు వారికి చెప్పినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. మెుత్తం ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. 

వారిపై సెక్షన్ 171 బీ, సీ,ఈ,ఎఫ్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న తరునంలో సైబరాబాద్ పరిధిలో 21 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉందని తెలిపారు.  

ఈ వార్తలు కూడా చదవండి

టీడీపీ ఎంపీ మురళీమోహన్ కారులో డబ్బు తరలిస్తూ పట్టుబడింది వీరే...

click me!