జనసేన అభ్యర్థి ఎస్పీవై రెడ్డికి అస్వస్థత: హైద్రాబాద్‌కు తరలింపు

Published : Apr 04, 2019, 12:24 PM IST
జనసేన అభ్యర్థి ఎస్పీవై రెడ్డికి అస్వస్థత: హైద్రాబాద్‌కు తరలింపు

సారాంశం

నంద్యాల  పార్లమెంట్ స్థానం నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి గురువారం నాడు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన హైద్రాబాద్‌కు తరలించారు.  

నంద్యాల: నంద్యాల  పార్లమెంట్ స్థానం నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి గురువారం నాడు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన హైద్రాబాద్‌కు తరలించారు.

ఎస్పీవైరెడ్డి జనసేన అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఎన్నికల సమయంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.  దీంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు.  ఎస్పీవై రెడ్డిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైద్రాబాద్‌కు తరలించారు. హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఎస్పీవై రెడ్డికి వయస్సు మీద పడినందునే ఈ దఫా టీడీపీ ఆయనకు టిక్కెట్టు కేటాయించలేదు.

ఎస్పీవై రెడ్డి అల్లుడు లేదా కూతురుకు టిక్కెట్టు కేటాయించాలని  కోరినా కూడ చంద్రబాబు టిక్కెట్టు ఇవ్వలేదు. కానీ, నంద్యాల ఎన్నికల ప్రచార సభలో ఎస్పీవై రెడ్డికి చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. కానీ ఆయన తన నామినేషన్ ను ఉప సంహరించుకోలేదు.

PREV
click me!

Recommended Stories

New year Celebrations : మూగచెవిటి పిల్లలతో కేక్ కట్ చేయించిన ఆళ్లనాని
పార్లమెంట్ లో వైసీపీ మహిళాశక్తి: ఆ నలుగురు.....